Virat vs Warner: SRH, RCB ఫ్యాన్స్ ఇప్పటికీ కొట్టుకు చచ్చే టాపిక్‌ ఇది.. విరాట్‌-వార్నర్‌లో ఎవరు బెస్ట్?

Virat vs Warner: 2016 ఐపీఎల్ సీజన్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. అప్పుడు కోహ్లీ ఏకంగా 973 పరుగులు చేశాడు.

Update: 2025-03-20 03:15 GMT
Virat vs Warner

Virat vs Warner: SRH, RCB ఫ్యాన్స్ ఇప్పటికీ కొట్టుకు చచ్చే టాపిక్‌ ఇది.. విరాట్‌-వార్నర్‌లో ఎవరు బెస్ట్?

  • whatsapp icon

Virat vs Warner: భారత క్రికెట్‌లో రికార్డుల గురించి మాట్లాడితే, ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ పేరు మారుమ్రోగేది. ఇప్పుడు అదే స్థాయిలో విరాట్ కోహ్లీ పేరు వినిపిస్తోంది. కొంతమంది అభిప్రాయం ప్రకారం, సచిన్ రికార్డులను బద్దలు కొట్టే అవకాశం కోహ్లీకే ఉంది. మరికొందరేమో, కోహ్లీకి అంత సీన్ లేదని, త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంటున్నారు. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ మంచి ఫామ్ చూపించాడు. ఇకపై తన లక్ష్యం ఏదైనా సాధించాకే రిటైర్మెంట్ తీసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఇదే సమయంలో, క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఐపీఎల్ 18వ సీజన్ రాబోతోంది. విశేషం ఏంటంటే, ఇది 18వ ఎడిషన్ కావడం, కోహ్లీ జెర్సీ నెంబర్ 18 కావడం.. ఇదే కప్ RCBదే అని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

ఇక ఇంటర్నేషనల్ క్రికెట్‌లోనైనా, ఐపీఎల్‌లోనైనా కోహ్లీకి సమయం చాలా తక్కువ. ఏ క్షణమైనా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. అందుకే ఈసారి ఐపీఎల్‌లో కోహ్లీ తన ఫుల్ ఫామ్‌లో ఆడి, అదరగొట్టాలని చూస్తున్నాడు. కొంతమంది ఆయన టీ20 ఫార్మాట్‌కు పనికిరాడని అంటున్నారు. కానీ, ఐపీఎల్‌లో మాత్రం అతనికి తిరుగులేని రికార్డు ఉంది. డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్‌ల కంటే ఎక్కువగా అతను రన్స్ చేసి ప్రూవ్ చేసుకున్నాడు.

అటు ఐపీఎల్‌లో జట్టు విజయం సాధించాలంటే స్ట్రైక్ రేట్, యావరేజ్‌తో పాటు, ఒక బాటర్‌ నిలకడగా ఆడాలి. RCBకి ఆ పనిని కోహ్లీనే చేస్తున్నాడు. 7 సీజన్లలో 500కి పైగా పరుగులు చేశాడు. ముఖ్యంగా, 2016 ఐపీఎల్ సీజన్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. అప్పుడు కోహ్లీ ఏకంగా 973 పరుగులు చేశాడు. 1000 పరుగుల మైలురాయికి దగ్గరగా వచ్చినా, అది ఇప్పటికీ ఐపీఎల్‌లో ఎవరికీ అందని రికార్డు. అయితే 2016లో కోహ్లీ మాత్రమే కాదు, వార్నర్ కూడా అదిరిపోయాడు. 848 పరుగులు చేసినా, అతని బ్యాటింగ్ సన్‌రైజర్స్‌కు టైటిల్ తెచ్చింది. కోహ్లీ మాత్రం బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా నిలిచిపోయాడు. అదే సమయంలో కోహ్లీ కన్నా మెరుగైన స్ట్రైక్ రేట్ వార్నర్‌కు ఉంది. RCB తరఫున విరాట్ కొన్ని కీలక మ్యాచ్‌ల్లో నెమ్మదిగా ఆడటంతో జట్టు నష్టపోయింది. కానీ వార్నర్ ధాటిగా ఆడి తన జట్టును గెలిపించాడు. అందుకే, వార్నర్ జట్టుకు టైటిల్ తెచ్చిన సందర్భాలు కోహ్లీ కంటే ఎక్కువ. అయితే ఈ సారి మాత్రం కోహ్లీ భీకర హిట్టింగ్ చేస్తాడని అంతా భావిస్తున్నారు. కోహ్లీ రికార్డుల కోసమే ఆడకుండా నిజంగా ఐపీఎల్ కప్ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతాడని ఫ్యాన్స్ చెబుతున్నారు.

Tags:    

Similar News