IPL-CSK: జడేజా కాదు.. అశ్విన్ కాదు.. హార్భజన్ కాదు.. అతనే తోపు స్పిన్నర్..!

ఐపీఎల్‌లో ఒకప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన బౌలర్ శదాబ్ జకాతి, టాప్ స్పిన్నర్లలో ఎవరు బెస్ట్ అనేది తేల్చే గేమ్‌లో పాల్గొన్నాడు. ఇందులో రవీంద్ర జడేజా, అశ్విన్, హార్భజన్ లాంటి భారతీయ లెజెండ్స్ ఉన్నా, చివరికి ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌కే మొగ్గు చూపాడు. గేమ్ మొదట్లో జడేజా, షకిబ్ అల్హసన్ మధ్య ఎంపిక చేయమన్నారు. జకాతి జడేజాను ఎంచుకున్నాడు. తర్వాత సునిల్ నరైన్, అజ్మల్ లాంటి బౌలర్లతో పోల్చినా జడేజానే అన్నారు. కానీ హర్భజన్ వచ్చేసరికి జడేజాను పక్కన పెట్టి హర్భజన్‌కే ఓటు వేశారు.
అక్కడి నుంచి హర్భజన్‌ను ఆఫ్రిది, అశ్విన్, అదిల్ రషీద్‌లతో పోల్చి హర్భజన్‌ను కొనసాగించారు. అయితే అనిల్ కుంబ్లేకు మాత్రం హర్భజన్‌ను పక్కన పెట్టారు. ఆపై కుంబ్లే కంటే షేన్ వార్నే బెస్ట్ అన్నారు. చివరగా ముత్తయ్య మురళీధరన్‌ను కూడా పక్కన పెట్టి, స్పిన్ ప్రపంచంలో వార్నేనే అత్యుత్తముడిగా అభివర్ణించారు. జకాతి ఇలా ఎంపికలు చేసిన తీరు చూస్తే.. ఆయన స్పిన్ బౌలింగ్‌లో గమనించే ప్రతిభ, ప్రభావం, ఆటతీరు ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా, అందరికంటే వార్నే ఎందుకు బెస్ట్ అనే దానికి ఆయన ఎంపికలు స్వయంగా సమాధానం చెబుతున్నాయి.
షేన్ వార్న్ క్రికెట్ ప్రపంచంలో లెగ్ స్పిన్‌కి ఓ కొత్త అర్థం ఇచ్చిన అసలైన మాస్టర్. ఆయన బౌలింగ్‌లో కేవలం టర్న్ మాత్రమే కాదు, అద్భుతమైన వ్యూహం, బ్యాట్స్‌మన్‌పై మానసిక ఒత్తిడి కూడా ఉండేది. ప్రతి బంతి కథలాగానే ఉండేది. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియకుండా చేసేవాడు. ప్రపంచంలోని ఎంతో మంది బ్యాట్స్‌మన్‌కి ఆయన బౌలింగ్ ఒక బిగ్ టెస్టే. అతని ఆటతీరు ఎంతో మందిని ప్రభావితం చేసింది. క్రికెట్‌లో స్పిన్ బౌలింగ్‌ని గౌరవించుకునేలా చేసిన గొప్ప కృషి వార్నేది. టెస్టుల్లోనూ, వన్డేల్లోనూ నమ్మకమైన మ్యాచ్‌విన్నర్‌గా నిలిచిన వార్నే, స్పిన్‌ను ఒక కళగా మార్చిన శిల్పి. ఆయన లెగసీ ఎన్నటికీ చిరస్థాయిగా ఉంటుంది.