Viral Video: మైదానంలోకి దూసుకొచ్చు కోహ్లీ కాళ్ల మీద పడిన అభిమాని..విరాట్ ఏం చేశాడో తెలిస్తే షాకే

Update: 2025-03-23 01:57 GMT
Viral Video: మైదానంలోకి దూసుకొచ్చు కోహ్లీ కాళ్ల మీద పడిన అభిమాని..విరాట్ ఏం చేశాడో తెలిస్తే షాకే
  • whatsapp icon

Viral Video: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 తొలి మ్యాచ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ ఘటన జరిగింది. ఒక అభిమాని మైదానంలోకి దూసుకువచ్చాడు. తన అభిమానస్టార్ పాదాలపై పడ్డాడు. నేరుగా కోహ్లీ పాదాలపై బోర్లా  పడి నమస్కరించాడు. ఇది చూసిన కోహ్లీ ఆశ్చర్యపోయాడు. వెంటనే అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది అతన్ని బయటకు తీసుకెళ్లారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్)పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) విజయం సాధించడంలో విరాట్ కోహ్లీ 59 పరుగులతో అజేయంగా నిలిచి, ఈడెన్ గార్డెన్స్ మొత్తాన్ని ఆశ్చర్యపరిచాడు. RCB చేజింగ్ లో 13వ ఓవర్ సమయంలో, ఒక అభిమాని మైదానంలోకి ప్రవేశించాడు. తన అభిమాన ఆటగాడు విరాట్ కోహ్లీని కలవడానికి, అతను భద్రతా వలయాన్ని ఛేదించి లోపలికి ప్రవేశించి నేరుగా కోహ్లీ పాదాలపై పడిపోయాడు. నేలపైకి చొరబడిన వ్యక్తి విరాట్ పాదాలను తాకాడు.


అతను మైదానంలోకి ప్రవేశించిన వెంటనే, అభిమాని విరాట్ కోహ్లీ పాదాలను మొక్కాడు. కానీ భద్రతా అధికారులు వెంటనే అతన్ని అక్కడి నుండి తరలించారు. మైదానంలో ఉన్న అధికారులు కూడా అభిమానిని మైదానం వదిలి వెళ్లిపోవాలని అభ్యర్థించారు. వెళ్ళే ముందు, అభిమాని విరాట్ కోహ్లీని గట్టిగా కౌగిలించుకున్నాడు. అభిమానిని తీసుకెళ్లడానికి భద్రతా అధికారి అతని దగ్గరికి వచ్చినప్పుడు, కోహ్లీ మర్యాదగా ప్రవర్తించమని, అతనికి ఎలాంటి హాని కలిగించవద్దని కోరాడు.

Tags:    

Similar News