Shreyas Iyer: 'అన్నా.. నువ్వు తోపు.. నీ ముందు కింగ్‌లు, లెజెండ్లు కూడా పనికిరారు..'! అయ్యర్‌పై సోషల్‌మీడియా ప్రశంసలు

'అన్నా... నువ్వు మాముల మనిషివి కావు.. నీ అంత నిస్వార్థ ఆటగాడు ప్రపంచంలోనే లేడు..' శ్రేయస్ అయ్యర్‌పై క్రికెట్ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ ఇవి. పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్‌లో అయ్యర్ సెల్ఫ్‌లెస్ బ్యాటింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తన సెంచరీ కోసం, వ్యక్తిగత రికార్డుల కోసం ఏ మాత్రం ఆలోచించకుండా అయ్యర్ ఓ కెప్టెన్‌గా నడుచుకున్న తీరు అందరిని ఫిదా చేసింది. సెంచరీల కోసం అవతలి ఎండ్‌లోని బ్యాటర్లకు కనీసం స్ట్రైక్ ఇవ్వకుండా మొత్తం ఓవర్లు ఆడే బ్యాటర్లు ఉన్న ఈ రోజుల్లో అయ్యర్ ప్రవర్తించిన తీరు నిజంగా అద్భుతమనే చెప్పాలి.
42 బంతుల్లో 97 పరుగులు చేసిన అయ్యర్ పంజాబ్ కింగ్స్ చివరి ఓవర్‌లో కనీసం ఒక్క బంతి కూడా ఆడలేదు అయ్యర్. కనీసం సింగిల్ తీసి తనకు స్ట్రైక్ ఇవ్వాలని కూడా అవతలి ఎండ్‌లో బ్యాటింగ్ చేస్తున్న శశాంక్ సింగ్‌ని అడగలేదు. ఎందుకంటే శశాంక్ మంచి ఊపుమీద ఉన్నాడు. చివరి ఓవర్‌లో చెలరేగి ఆడాడు. లాస్ట్ ఓవర్‌లో పంజాబ్ ఏకంగా 23 పరుగులు చేసింది. గుజరాత్ ఓడిపోవడానికి ఈ ఓవరే కారణమైంది. ఒక వేళ సెంచరీ కోసం అయ్యర్ ఆలోచించి ఉంటే 23 పరుగులు కచ్చితంగా వచ్చేవి కావు. అందుకే అయ్యర్ అలా చేయలేదు. శశాంక్‌కే పూర్తిగా స్వేచ్ఛనిచ్చాడు. అసలుసిలసైన కెప్టెన్ అనిపించుకున్నాడు.
అటు ఈ విషయంపై శశాంక్ సైతం స్పందించాడు. 16 బంతుల్లోనే 44 రన్స్ చేసిన శశాంక్ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పాడు. శ్రేయస్ నుంచి వచ్చిన సూచనలతోనే పరిస్థితికి తగ్గట్టుగా దూకుడుగా ఆడినట్టు వివరించాడు. తన ఆటతీరు జట్టుకు అవసరమైన భారీ స్కోరును అందించడానికే కట్టుబడి ఉందని.. అందుకు మేనేజ్‌మెంట్ కూడా పూర్తిగా మద్దతుగా నిలిచిందని స్పష్టం చేశాడు. అయ్యర్ శతకం కంటే టీమ్ స్కోర్.. విజయం ముఖ్యమన్న ఆత్మవిశ్వాసంతోనే కెప్టెన్‌కు స్ట్రైక్ ఇవ్వకుండా బంతులను బాదినట్టు చెప్పుకొచ్చాడు. నిజానికి శశాంక్ అప్రోచ్ కారణంగానే జట్టు గెలిచింది. ఇది టీమ్ మేనేజ్‌మెంట్‌కు శశాంక్‌పై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచింది. అటు శ్రేయస్ అయ్యర్ సూచనలతోనే బ్యాటింగ్ చేశానని శశాంక్ చెప్పడంతో ఇటు ఫ్యాన్స్ చాలా ఖుషీ అవుతున్నారు. టీమిండియాకు అయ్యర్ లాంటి నిస్వార్థమైన బ్యాటర్లు మరింత మంది కావాలని కోరుతున్నారు.