MS Dhoni: స్టంపింగ్స్‌లో నిన్ను కొట్టిన వాడు ఈ భూమండలంపైనే లేడు.. ధోనీనా మజాకా!
MS Dhoni: 43 ఏళ్ల వయసులోనూ ధోని అద్భుతంగా స్టంపింగ్ చేయడం ద్వారా తన క్లాస్ చూపించాడు. ఫిల్ సాల్ట్ డేంజర్‌ను కట్ చేసిన ధోని, అభిమానులకు మరోసారి ఆనందాన్ని పంచాడు.

MS Dhoni: స్టంపింగ్స్‌లో నిన్ను కొట్టిన వాడు ఈ భూమండలంపైనే లేడు.. ధోనీనా మజాకా!
MS Dhoni: ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున మళ్లీ తన మాయ చూపించిన మహేంద్ర సింగ్ ధోని, వయస్సు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపించాడు. 43 ఏళ్ల వయసులోనూ అతని స్పష్టత, వేగం, ఆటపై పట్టుదల చూస్తే అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల జరిగిన చెన్నై – బెంగళూరు మ్యాచ్‌లో ధోనికి మరోసారి మెరుపు క్షణం లభించింది.
మ్యాచ్‌లో నాలుగో ఓవర్ చివరి బంతిపై, నూర్ అహ్మద్ వేసిన లెంగ్త్ బాల్ ఆఫ్ సైడ్ వైపు స్వల్పంగా బయటకు మళ్లింది. ఆ సమయంలో బ్యాట్స్‌మన్ ఫిల్ సాల్ట్ డ్రైవ్ ప్రయత్నించగా, బ్యాట్‌కు బాల్ తగలకుండా వెనక్కి వెళ్లింది. ఆ సమయంలో ధోని బంతిని సునాయాసంగా క్యాచ్ చేసి, బళ్లిని అద్భుతంగా తొలగించి స్టంప్ చేశాడు. అతని రెఫ్లెక్స్ వేగం కనీసం 0.10 సెకన్ల కంటే తక్కువగా ఉండిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆ సమయంలో ఫిల్ సాల్ట్ దుమ్ము దులిపే ఆటతీరుతో 16 బంతుల్లో 32 పరుగులు చేయగా, ధోని అద్భుత స్టంపింగ్‌తో అతని ఇన్నింగ్స్‌కు బ్రేక్ వేశాడు. అంపైర్ తక్షణమే థర్డ్ అంపైర్‌ను సంప్రదించగా, రీప్లేలో స్పష్టంగా సాల్ట్ కాలు మట్టికి తగలకపోవడం కనిపించింది. వెంటనే అవుట్ డిసైజన్ వెలువడగా, స్టేడియం మొత్తం పసుపు సముద్రంలా ఉప్పొంగిపోయింది.
ఇది ధోనికి ఇదే తొలిసారి కాదు. గత మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను కూడా ఇదే తరహాలో స్టంప్ చేసి ఔటయ్యేలా చేశాడు. ఆ మ్యాచ్‌లో కూడా బంతి వేసింది నూర్ అహ్మదే కావడం విశేషం. SKY అప్పటికి 29 పరుగులతో క్రీజులో ఉండగా, ధోనికి మరో మెమొరబుల్ మోమెంట్ దక్కింది. ధోని గ్లోవ్స్ వేసే వేగం, బంతిని అందుకొని బేళ్లను విరగదీసే క్షణం.. ఇవన్నీ చూడ్డానికి అదిరిపోయే విజువల్స్. అతని స్థాయిలో రియాక్షన్ టైమ్ చూపగలిగే కీపర్లు అరుదే. ఇప్పటికీ ధోని మరెవరకన్నా మెరుగైన వికెట్ కీపర్ అనే అభిప్రాయం అభిమానుల్లో అలాగే ఉంది.