
Sara Tendulkar in GEPL: ముంబై ఫ్రాంచైజీని కొనేసిన సారా టెండుల్కర్
Sara Tendulkar in GEPL: సచిన్ టెండుల్కర్ కూతురు సారా టెండుల్కర్ ఇప్పుడు ఒక స్పోర్ట్స్ ఫ్రాంచైజీకి ఓనర్. గతేడాది నుండి ఆరంభమైన గ్లోబల్ ఇ-క్రికెట్ ప్రీమియర్ లీగ్ ( GEPL ) ఈ ఏడాది రెండో సీజన్ జరగనుంది. రెండో సీజన్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలోనే సారా టెండుల్కర్ ముంబై ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది.
జెరోదా సీఈఓ నిఖిల్ కామత్, ఏక్సెల్ ఇండియా సహ వ్యవస్థాపకులు ప్రశాంత్ ప్రకాష్, లెన్‌స్కార్ట్ సీఈఓ పీయుష్ బన్సాల్ వంటి ఎంటర్ ప్రెన్యువర్స్ ఈ గ్లోబల్ ఇ-క్రికెట్ ప్రీమియర్ లీగ్ లో ఫ్రాంచైజీల ఓనర్స్ గా కొనసాగుతున్నారు. తాజాగా సారా టెండుల్కర్ కూడా ఆ జాబితాలోకి వచ్చి చేరింది.
ఇండియాలో తయారైన ఈ సిమ్యులేషన్ క్రికెట్ గేమ్‌కు కొద్దికొద్దిగా ఆధరణ పెరుగుతోంది. గతేడాది జరిగిన ఫస్ట్ సీజన్‌లో 8 జట్లు తలపడ్డాయి. చెన్నై వాల్వ్స్, ఢిల్లీ షార్క్స్, దుబాయ్ వైపర్స్, కోల్‌కతా హాక్స్, లండన్ రైనోస్, న్యూయార్క్ ఏప్స్, ముంబై గ్రిజిల్స్, సిడ్నీ పాంథర్స్ టీమ్స్ ఈ గ్లోబల్ ఇ-క్రికెట్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొంటున్నాయి.
గ్లోబల్ ఇ-క్రికెట్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై గ్రిజ్లిస్ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడం అనేది వ్యాపార ప్రపంచంలోకి ఇది సారా వేసిన మొదటి అడుగు అవుతుంది. ఈ ఆన్ లైన్ గేమింగ్ లో విజేతకు రూ. 3.05 కోట్ల ప్రైజ్ మనీ ఇస్తారు. 15 వారాలపాటు ఈ లీగ్ కొనసాగుతుంది.
సారా టెండుల్కర్‌కు కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. అనేక సందర్భాల్లో ఐపిఎల్ టోర్నమెంట్స్‌లో, ఇతర ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్‌లో సారా స్టేడియానికి వచ్చి మ్యాచ్‌లు ఎంజాయ్ చేయడం తెలిసిందే. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోనూ సారా టెండుల్కర్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఆ ఫాలోయింగ్ ఆమెను ముంబై ఫ్రాంచైజీ ఓనర్‌గా బూస్టింగ్ ఇస్తుందేమో చూడాలి మరి.