IPL Fix: చెన్నై స్పిన్నర్‌పై అనేక అనుమానాలు.. SRHతో మ్యాచ్ ఫిక్స్ అయ్యిందా?
IPL Fix: ఎలాగో ఇంటికి పోయినట్టే కాబట్టి, కనీసం ఇక మీదట ఆడే మ్యాచ్‌లలో అయినా, ఇంటెంట్ ఎలా ఉంటుందో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చూపిస్తే చూసి తరిద్దాం అని అభిమానుల కోరిక!

IPL Fix: చెన్నై స్పిన్నర్‌పై అనేక అనుమానాలు.. SRHతో మ్యాచ్ ఫిక్స్ అయ్యిందా?
IPL Fix: 'నేను ముందు ఓడిపోతా.. వద్దద్దన్నా.. మీరుండండి... నేను ఓడిపోయి ఇంటికి పోతా...అంటూ పోటీ పడి మరి IPL ఫ్యాన్స్ ఈ మ్యాచ్ చూసేదానికంటే నిద్ర పోయేది ఎంతో ఉత్తమం అనేంతలా చేసిన రెండే రెండు జట్లు.. చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్. చెపాక్ వేదికగా ప్లే ఆఫ్స్‌కి ఏ మాత్రం వెళ్లాలన్న ఆశ ఉన్నా, తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో CSKకే చిత్తయ్యింది. మొదట బాటింగ్ చేయాల్సొస్తే చాలు, టీ ట్వంటీ అన్న సంగతే మర్చిపోయి, టెస్ట్ మ్యాచ్ ఆడుతాం మేము అని ఫిక్స్ అయ్యే చెన్నై బాట్స్మెన్, మరొక్క సారి ఘోరంగా విఫలమయ్యారు. చెపాక్‌కి రాక రాక వచ్చిన తమిళ హీరో అజిత్ కుమార్, తనకి క్రికెట్ పెద్దగా తెలియకపోయిన పక్కనే ఉన్న తన సతీమణి షాలిని దగ్గర డీటెయిల్స్ కనుక్కోవడం... ఈ ఒక్క మోమెంట్ కోసమే, చెన్నై ఫ్యాన్స్ వేలకు వేలు పెట్టి మరి స్టేడియానికి వచ్చినట్టుగా అయింది. టీంలో ఉండే 11మందిలో కనీసం ఒక్కరు, ఒక్కరైనా గెలవాలని ఆడుతున్నట్టుగా అనిపించలేదు.
155పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ ముందు ఉంచిన చెన్నై.. బౌలింగ్‌లో అయినా రాణిస్తుందని అనుకున్నారంతా. కానీ, ఎటు చూసినా నో బాల్స్, వైడ్స్ వేసి మరి కుంటుకుంటూ ఛేజ్ చేస్తున్న సన్ రైజర్స్‌కి విజయాన్ని అందించింది. మీరు ముందుకెళ్ళండి బ్రదర్, మేం ఇంటికెళతాం అని చెప్పకనే చెప్పారు. ఒకటా, రెండా, వచ్చిన ప్రతి బౌలర్ కూడా, అదేదో ఎవరో చెప్పినట్టు, వారి ఆర్డర్స్ వీళ్ళు ఫాలో అవుతున్నట్టు, నో బాల్స్ వెయ్యడం, సోషల్ మీడియా లో ఫాన్స్ కి పలు అనుమానాలని కలిగించింది. ఎప్పుడు చూసినా ముంబై ఇండియన్స్ మాత్రం అంపైర్‌ని కొనేశారు.. కొనేశారు అంటూ రెచ్చిపోయే న్యూట్రల్ ఫ్యాన్స్, చెన్నై బౌలింగ్ వాలకం చూసి, అసలు ఫిక్సింగ్ అనే మాట వాడాల్సింది ముంబైకి కాదు చెన్నైకి అంటూ డిక్లేర్ చేసి పడేశారు. టోర్నమెంట్ మొత్తంలో చెన్నైకి అత్యుత్తమ బౌలర్‌గా పేరు పొందిన నూర్ అహ్మద్. నిన్న ఒకే ఓవర్ లో ఏకంగా రెండు నో బాల్స్ వేసి మ్యాచ్ ని ఎస్.ఆర్.హెచ్ వైపు మలుపు తిప్పిన తీరు చూసి ఫాన్స్ లబోదిబోమన్నారు.
ఇంకా మతీశ పతిరానా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. జూనియర్ మలింగా అన్నారు, యార్కర్ వేస్తే బాట్స్మన్ కి చుక్కలే అన్నారు, కట్ చేస్తే... వైడ్ లు, నో బాల్స్ తో అసలు నాకంటే వరస్ట్ బౌలర్ ఇంకొకడు ఉండదు, కావాలంటే చూస్కోండి అనే రేంజ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు పతిరానా. ఎంత ధోని కి ఇష్టమైతే మాత్రం, మరి ఇంతలా మోయాల్సిన కర్మ మాకేంటి అంటూ అభిమానుల గోల ఒక పక్క..... ఎహె సి.ఎస్.కె ఈ సారి గెలవడం అటు ఉంచి, అసలు భవిష్యత్తు లో ఆ జట్టు మనుగడ సాధ్యమేనా...ముందు అది కదా మనం మాట్లాడుకోవాల్సింది.... ఇవి, చెన్నై ఫాన్స్ ఆన్లైన్ లో చర్చించుకున్న టాపిక్స్. నూర్ అహ్మద్, మతీశ పతిరానా పై ఫిక్సింగ్ ఆరోపణలు చేసి, వారిని ఎంత తిట్టినా, Battingలో చెన్నై తమ శైలిని మార్చుకోనంత వరకు, వాళ్ళకి కష్టాలు తప్పవు.
టీ20 క్రికెట్ లో అన్నిటికంటే ఎంతో ముఖ్యమైనది ఇంటెంట్. చెన్నై బాట్స్మెన్ లో అది తీవ్రంగా లోపిస్తోంది. ఒక్క ఆటగాడు కూడా మనం బౌలర్ లని ఈరోజు ఎలా అయిన చితకొట్టాలి, అన్న ఉద్దేశం తో ఆడడం లేదు. ఎంత సేపు వికెట్ పడకుండా, డిఫెన్సివ్ మైండ్సెట్‌తో టీ20 క్రికెట్ ఆడితే, గెలవడం అసాధ్యం. ధోని లాంటి దిగ్గజ కెప్టెన్‌కి ఇది తెలియంది కాదు. కానీ, టీంలో ఆటగాళ్లే లేనప్పుడు, కాంబినేషన్‌లు ఎలా కుదురుతాయి, మ్యాచ్ లు ఎలా గెలుస్తారు. రాక రాక వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ మెరుపులు మెరిపించినా, అతనికి సరైన తోడు అవతల ఎండ్‌లో లేకపోవడం... సి.ఎస్.కే దుస్థితికి అద్దం పట్టే చిహ్నం. ఎలాగో ఇంటికి పోయినట్టే కాబట్టి, కనీసం ఇక మీదట ఆడే మ్యాచ్‌లలో అయినా, ఇంటెంట్ ఎలా ఉంటుందో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చూపిస్తే చూసి తరిద్దాం అని అభిమానుల కోరిక!