Vansh Bedi: ధోనీ వారసుడు వచ్చేశాడు.. చెన్నైకు కొత్త ఆప్షన్ దొరికేశాడు!
Vansh Bedi: మిడిల్ ఆర్డర్ లోపాల మధ్య వంశ్ బేడి ధైర్యం, దూకుడు చెన్నైకు కొత్త ఆప్షన్‌గా నిలుస్తోంది.

Vansh Bedi: ధోనీ వారసుడు వచ్చేశాడు.. చెన్నైకు కొత్త ఆప్షన్ దొరికేశాడు!
Vansh Bedi: చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్‌లో వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో ఉంది. ముంబైపై విజయం తర్వాత బెంగళూరు, రాజస్తాన్ చేతిలో ఓటములు బృందంలో లోపాలను బయటపెట్టేశాయి. ముఖ్యంగా మధ్య ఓవర్లలో బ్యాటింగ్ వీక్‌గా కనిపిస్తోంది. అటువంటి సమయంలో ఒక కొత్త పేరు జట్టులో హాట్‌టాపిక్‌గా మారింది..వంశ్ బేడి.
ఈ ఢిల్లీ కుర్రాడిని సీఎస్కే గత వేలంలో కేవలం రూ. 55 లక్షలకు తీసుకుంది. అప్పట్లో పెద్దగా ఎవరూ గమనించకపోయినా, ఇప్పుడు అతడి సామర్థ్యం గురించి అందరూ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అతడి బ్యాటింగ్ ధోరణి, స్పిన్ పేస్ ఏదైనా డామినేట్ చేయగల సామర్థ్యం కలిగిన ఆటగాడిగా చర్చ జరుగుతోంది.
వంశ్ బేడి ఓ వికెట్ కీపర్ కూడా. మాహీ తర్వాత ఆ స్థానం ఖాళీగా ఉంటుందని భావిస్తే, ఈ యువ ఆటగాడు భవిష్యత్తులో ఆ రోల్‌ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు అతడు పెద్దగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకపోయినా, ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో అతడి ఆట అన్ని చూపుల్నీ ఆకర్షించింది.
DPLలో వంశ్ చేసిన కొన్ని ఇన్నింగ్స్:
--> 47(19)* తొలి మ్యాచ్‌లో
--> 30(18)* వెస్ట్ ఢిల్లీ లయన్స్‌పై
--> ఈస్ట్ ఢిల్లీపై 96(41) పరుగుల మెరుపు ఇన్నింగ్స్
సీజన్ మొత్తంలో 9 ఇన్నింగ్స్‌లో 221 పరుగులు, స్ట్రైక్ రేట్ 185. పేస్, స్పిన్ రెండింటిపైనా అతడి స్ట్రైక్ రేట్లు 170 పైగా ఉండటం అతని ధాటిని వెల్లడిస్తాయి. చెన్నై జట్టులో ప్రస్తుతం నెం.4 స్థానం ఖాళీగా ఉంది. జట్టు మిడిల్ ఆర్డర్ అస్థిరంగా ఉన్న సమయంలో వంశ్ లాంటి ప్లేయర్‌ను ట్రై చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఎటువంటి పెద్ద అనుభవం లేకపోయినా, ధైర్యంగా ఆడే ఆటగాడిగా వంశ్ పేరు సీఎస్కే ప్లానింగ్‌లో బలంగా నిలుస్తోంది. వచ్చే మ్యాచ్‌లలో అతడికి అవకాశం వస్తే, మధ్య ఓవర్లలో జట్టుకు అవసరమైన స్థిరతను అందించగలడని ఆశలు పెరిగిపోయాయి.