KKR vs SRH: 300 అన్నారు.. ఉగ్రరూపమన్నారు.. సీన్ కట్ చేస్తే టేబుల్ లాస్ట్‌లో బొజ్జున్నారు!
KKR vs SRH: ఈడెన్ గార్డెన్స్‌లో ఘన విజయాన్ని నమోదు చేసిన కోల్కతా, పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరగా, వరుసగా పరాజయాలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ జట్టు చివర స్థానానికి పడిపోయింది.

KKR vs SRH: 300 అన్నారు.. ఉగ్రరూపమన్నారు.. సీన్ కట్ చేస్తే టేబుల్ లాస్ట్‌లో బొజ్జున్నారు!
KKR vs SRH: ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్కతా నైట్ రైడర్స్ అదిరిపోయే ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 80 పరుగుల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో మళ్లీ పుంజుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. అన్ని విభాగాల్లో దూకుడుగా ఆడి హైదరాబాద్‌ను ఒక్క కొలమానంలోనూ పోటీలో నిలబడనివ్వలేదు.
టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ మొదట బౌలింగ్ ఎంచుకున్నా.. ఆ నిర్ణయం కాస్త దారుణ ఫలితాన్ని తెచ్చిపెట్టింది. తొలుత క్వింటన్ డికాక్ (1), సునీల్ నరైన్ (7) త్వరగా వెనుదిరిగినా.. అజింక్య రహానే – అంగ్కృష్ రఘువంశి జోడీ పటిష్టంగా నిలబడి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లింది. ఈ ఇద్దరూ కలసి 81 పరుగుల భాగస్వామ్యం అందించారు. రఘువంశి 50 పరుగులు నమోదు చేయగా, రహానే 38 పరుగులు చేశాడు.
వీరిద్దరూ ఔటైన తర్వాత మిడిల్ ఆర్డర్ లోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్ మరోసారి హైదరాబాద్‌పై చెలరేగాడు. వరుసగా మూడోసారి ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన అయ్యర్.. 29 బంతుల్లో 60 పరుగులు చేసి మరోసారి తన క్లాస్ చూపించాడు. అతడికి రింకు సింగ్ 17 బంతుల్లో 32 పరుగులు చేసి తోడుగా నిలిచాడు. వీరి దెబ్బకు కేకేఆర్ 200 పరుగుల భారీ స్కోర్‌ను ఖాతాలో వేసుకుంది.
రన్ చేజ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. పవర్‌ప్లే నుంచే వికెట్లు కోల్పోతూ నిలదొక్కుకోలేకపోయారు. ఇక స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బంతితో కాటేసాడు. అతడు మూడు కీలక వికెట్లు పడగొట్టి హైదరాబాద్ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. మొత్తం మీద కోల్కతా బౌలర్లు హైదరాబాద్ బ్యాటర్లను కట్టడి చేస్తూ 80 పరుగుల తేడాతో విజయం నమోదు చేశారు.