IPL 2025: తమ్ముళ్లూ.. ఇది రాసి పెట్టుకోండి.. భవిష్యత్‌లో టీమిండియా సూపర్‌ స్టార్ అతనే!

IPL 2025: ముంబై ఇండియన్స్ తమ తర్వాతి మ్యాచ్‌లో మార్చి 29న గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. విఘ్నేష్ పుత్తూర్ మళ్లీ బరిలోకి దిగితే, మరిన్ని అద్భుతాలను అందించగలడని అభిమానులు ఆశిస్తున్నారు.

Update: 2025-03-29 02:30 GMT
IPL 2025

IPL 2025: తమ్ముళ్లూ.. ఇది రాసి పెట్టుకోండి.. భవిష్యత్‌లో టీమిండియా సూపర్‌ స్టార్ అతనే!

  • whatsapp icon

IPL 2025: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ యువ స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూర్ తన తొలి మ్యాచ్‌లోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, ముంబై ఓటమిపాలైనప్పటికీ, ఈ కేరళ యువ బౌలర్ తన బౌలింగ్ నైపుణ్యంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. చెన్నై 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న సమయంలో పుత్తూర్ కీలకంగా మూడు వికెట్లు తీసి మ్యాచ్‌కు ఉత్కంఠను తీసుకొచ్చాడు. CSK బ్యాటింగ్‌లో గైక్వాడ్, శివం దూబే, దీపక్ హుడా వంటి కీలక ఆటగాళ్లను ఔట్ చేయడం పుత్తూర్ ధైర్యాన్ని, ప్రదర్శనలో స్థిరత్వాన్ని తెలియజేసింది. ముఖ్యంగా అతని వేసే ఎడమచేతి ఆర్తోడాక్స్ స్పిన్ బంతులకు చెన్నై ఆటగాళ్లు తడబడటం గమనార్హం. పిచ్ సహకారం ఉన్నప్పటికీ, పుత్తూర్‌ చూపించిన సమయపాలన, బౌలింగ్ కంట్రోల్ ప్రొఫెషనలిజం సూచిస్తున్నాయి.

ముంబై కోచ్ మహేలా జయవర్ధనే కూడా ఈ యువ ఆటగాడిని ప్రశంసించాడు. అతను మొట్టమొదటి మ్యాచ్‌లో ఒత్తిడికి లోనవకుండా తన పని చేశాడని, మళ్లీ తదుపరి మ్యాచ్‌లో కూడా అదే స్థిరతతో మొదలు పెట్టాలని సూచించాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతడు ముంబై తరఫున సిద్ధంగా ఉంటాడన్న విశ్వాసాన్ని జయవర్ధనే వ్యక్తపరిచాడు. అతని నైపుణ్యం, ఆత్మవిశ్వాసం బట్టి, అతడిని చెన్నై మ్యాచ్‌లో ఆడించామన్నారు.

చెపాక్ మైదానం స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని తెలుసుకుని, పుత్తూర్‌ను ఆత్మవిశ్వాసంగా బరిలోకి దింపినట్లు జయవర్ధనే వెల్లడించాడు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వంటి CSK బౌలర్ల మధ్య పుత్తూర్ తన ప్రత్యేకతను చూపించగలిగాడు. అతను చెన్నైలో మైదానంలో తడబడకుండా చూపిన ప్రదర్శన, అతనిలో ఉన్న మెచ్యూరిటీని వెల్లడించిందని జయవర్ధనే పేర్కొన్నాడు.

Tags:    

Similar News