IPL 2025: కావ్య మారన్ టెన్షన్: స్టార్క్ దెబ్బకు SRH పరిస్థితి ఏమవుతుందో?
IPL 2025 : ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన విధ్వంసక బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు దూకుడుగా ఆడే బ్యాటర్లతో నిండిన ఈ జట్టు తదుపరి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉంది.

IPL 2025 : ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన విధ్వంసక బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు దూకుడుగా ఆడే బ్యాటర్లతో నిండిన ఈ జట్టు తదుపరి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉంది. సొంతగడ్డపై జరిగిన గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో ఎదురైన ఓటమిని మరచిపోయి, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ కంచుకోట వైజాగ్‌లో విజయం సాధించాలని చూస్తోంది. అయితే, 11.75 కోట్ల షాక్‌ను తప్పించుకుంటేనే కదా వారు గెలిచేది? ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో SRH, దాని యజమాని ముందు ఇదే పెద్ద సమస్య.
11.75 కోట్ల రూపాయల షాక్ ఏమిటి?
ఇప్పుడు ఈ 11.75 కోట్ల షాక్ ఏమిటంటే? దీనికి ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు మిచెల్ స్టార్క్‌తో సంబంధం ఉంది. అతను సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ IPL 2025 కోసం మిచెల్ స్టార్క్‌ను 11.75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. స్టార్క్ ముందు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఏమీ చేయలేరు. SRH యాజమాన్యం దీని గురించే ఆందోళన చెందుతోంది. అభిషేక్, హెడ్ కలిసి రాణించకపోతే ఏమి జరుగుతుందో వారు IPL 2025లో LSGతో జరిగిన తమ గత మ్యాచ్‌లో చూశారు. అక్కడ వారు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు అదే విషయం వరుసగా రెండో మ్యాచ్‌లో జరిగితే, జట్టుపై ఒత్తిడి పెరుగుతుంది.. సమస్యలు ఎక్కువవుతాయి.
IPL 2024లో మిచెల్ స్టార్క్ KKR జట్టులో ఉన్నాడు. అప్పుడు ఆ సీజన్‌లోని క్వాలిఫయర్ 1లో ట్రావిస్ హెడ్‌ను ఖాతా తెరవకముందే డగౌట్‌కు పంపాడు. అలాగే, IPL 2024 ఫైనల్‌లో SRH మళ్లీ KKRతో తలపడినప్పుడు, ఈసారి స్టార్క్ అభిషేక్ శర్మ కథను 5 బంతుల్లోనే ముగించి హెడ్‌తో అతని పార్టనర్ షిప్ విడదీశాడు. ఆ తర్వాత ఏమి జరిగిందో ప్రపంచానికి తెలుసు. KKR IPL 2024 టైటిల్‌ను గెలుచుకుంది.
ఇది కేవలం IPL పిచ్ గురించే కాదు, మొత్తం క్రికెట్ గురించి మాట్లాడినా స్టార్క్ ముందు హెడ్ పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పటివరకు 7 ఇన్నింగ్స్‌ల్లో స్టార్క్‌పై 29 బంతులు ఆడిన హెడ్ కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సమయంలో భారీ సిక్సర్లు కొట్టే హెడ్ ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. అంటే స్టార్క్‌పై అతను ఇప్పటికీ తన మొదటి సిక్స్ లేదా ఫోర్ కోసం ఎదురు చూస్తున్నాడు. స్టార్క్ 7 ఇన్నింగ్స్‌ల్లో హెడ్‌ను 5 సార్లు అవుట్ చేశాడు, అందులో 4 సార్లు క్లీన్ బౌల్డ్ కాగా ఒకసారి వికెట్ వెనుక క్యాచ్ ఇచ్చాడు.