MS Dhoni: ఇది రాసిపెట్టుకోండి.. 43 కాదు.. 103ఏళ్లు వచ్చినా ధోనీని ఈ విషయంలో ఎవరూ బీట్ చేయలేరు!
MS Dhoni: ముంబైతో చెపాక్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్‌ను కేవలం 0.12 సెకన్లలో స్టంప్ చేసిన విధానం, ప్రపంచ క్రికెట్‌లోకి మరోసారి ధోని పేరుని హైలెట్ చేసింది.

MS Dhoni: ఇది రాసిపెట్టుకోండి.. 43 కాదు.. 103ఏళ్లు వచ్చినా ధోనీని ఈ విషయంలో ఎవరూ బీట్ చేయలేరు!
MS Dhoni: భారత క్రికెట్‌లో అభిమానులు తమ అభిమాన ఆటగాళ్లను దేవుళ్లుగా పరిగణించడం సామాన్యమే. సచిన్ టెండూల్కర్‌కు గాడ్ ఆఫ్ క్రికెట్, గంగూలీకి గాడ్ ఆఫ్ ఆఫ్‌సైడ్ లాంటి బిరుదులు ఇలా ఎన్నో వచ్చాయి. కానీ భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనికి మాత్రం ఇప్పటివరకు అలాంటి టైటిల్ కనిపించలేదు. అతడి ఆట, అతడి నాయకత్వం, అతడి చక్కని వికెట్ కీపింగ్ ప్రతిభకు సరిపోయే పేరు దొరకలేదు. అయితే IPL 2025లో ముంబైపై జరిగిన మ్యాచ్‌లో ధోనీ విన్యాసం చూసిన తర్వాత అతనికి గాడ్ ఆఫ్ స్టంపింగ్స్ అనే బిరుదు ఇస్తే సరిపోతుందని ఎవరైనా ఒప్పుకుంటారు.
ధోనిని వయసుతో కొలవడం అంటే సముద్రాన్ని గాజు గ్లాసుతో కొలవడమే. 43 ఏళ్ళ వయసులోనూ అతను గ్రౌండ్‌లో చూపుతున్న స్పీడ్, స్టైల్, స్టంపింగ్స్ అన్నీ కాళ్లు వణికించే స్థాయిలో ఉంటున్నాయి. ముంబైతో చెపాక్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్‌ను కేవలం 0.12 సెకన్లలో స్టంప్ చేసిన విధానం, ప్రపంచ క్రికెట్‌లోకి మరోసారి ధోని పేరుని హైలెట్ చేసింది.
ఇది కొత్త విషయమేమీ కాదు. ఏ సీజన్ తీసుకున్నా.. ఏ స్టేడియం చూసుకున్నా.. ధోనీ చేతుల్లో బాల్ పడిన వెంటనే బ్యాట్స్‌మెన్‌కి వెనక్కి తిరగాల్సిందే. 2007లో భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ నుంచి 2025 IPL సూర్యకుమార్ యాదవ్ స్టంపింగ్స్ వరకు ప్రతీ స్టంపింగ్ ఓ సంచలనమే. కానీ వయసు పెరిగినా స్పీడ్ తగ్గని వికెట్ కీపర్ అతను. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇలా ఉండే ఒకే ఒక్కడు ధోనీ.
చెన్నై టీమ్‌లో ధోని ఉంటే గ్రౌండ్ అంతా ఓ ఎనర్జీ ఫీల్డ్‌తో నిండిపోతుంది. నిజానికి ప్రతి సీజన్ మొదలైనప్పుడు ధోనీకి 'ఇదే ఫైనల్ సీజన్' అనే ప్రచారం మొదలవుతుంది. అయితే ధోనీ మాత్రం తన పనే తానే చేసుకుంటూ వెళ్తాడు. ఆ మైండ్‌సెట్‌తోనూ, ఆ లెవెల్ ఫోకస్‌తోనూ, ప్రతీ బాల్‌కి రియాక్ట్ అయ్యే తీరు చూస్తుంటే ధోనీనే చెన్నైకి అసలైన గేమ్‌చేంజర్ అనిపిస్తుంది. వికెట్ కీపింగ్ అనేది కేవలం క్యాచ్‌లు పట్టడం మాత్రమే కాదు. అది ఫీల్డ్ మేనేజ్‌మెంట్.. బౌలర్ మైండ్‌ను చదవడం, బ్యాట్స్‌మెన్ ఆటను గమనించడం... ఈ మూడింటినీ ఒకేసారి చేయడం ధోనీ స్పెషాలిటీ. ఇదే నిజమని ధోని తన కెరీర్ అంతా నిరూపించాడు. వయసు మీద పడిందంటే దేహం మారుతుంది గానీ, ధోనిలోని ఆకలి మాత్రం అలాగే ఉంది. అందుకే అతని స్టంపింగ్స్ చూస్తే, అవి కేవలం వికెట్లు తీసిన సందర్భాలుగా అనిపించవు. అవి అతని క్లాస్‌కు.. క్రికెట్‌పై అతని కమిట్‌మెంట్‌ను చెప్పే సాక్ష్యాలు.