Saweety Boora's Viral Video: పోలీసు స్టేషన్‌లో భర్తపై మాజీ వరల్డ్ ఛాంపియన్ బాక్సర్ స్వీటి దాడి
Saweety Boora attack on husband Deepak Niwas Hooda: అర్జున అవార్డుగ్రహీత దీపక్ నివాస్ హుడాతో బాక్సర్ స్వీటి బూర పెళ్లి

Saweety Boora's Viral Video: పోలీసు స్టేషన్‌లో భర్తపై మాజీ వరల్డ్ ఛాంపియన్ బాక్సర్ స్వీటి దాడి
Saweety Boora thrashes her husband Deepak Niwas Hooda: మాజీ వరల్డ్ ఛాంపియన్ బాక్సర్ స్వీటి బూర తన భర్త, ప్రముఖ కబడ్డీ ఆటగాడు దీపక్ నివాస్ హుడాపై చేయి చేసుకున్నారు. హర్యానాలోని హిసార్ పట్టణ మహిళా పోలీస్ స్టేషన్‌లో మార్చి 15న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది.
అర్జున అవార్డుగ్రహీత దీపక్ నివాస్ హుడాతో బాక్సర్ స్వీటి బూరకు 2022 లో వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన తరువాత వరకట్నం కోసం హుడా వేధిస్తున్నాడని బూర ఆరోపించారు. ఖరీదైన కారు కావాలని దీపక్ డిమాండ్ చేశారు. దీపక్ కోరిక ప్రకారమే కారు కొనిచ్చారు. అయినప్పటికీ వరకట్న వేధింపులు ఆగలేదని స్వీటి తెలిపారు. ఆయన తనపై దాడి చేశారని బూర చెబుతున్నారు. ఇదే విషయమై ఫిబ్రవరి 25న బుర హిసార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డైవర్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
బూర డైవర్స్ పిటిషన్ నేపథ్యంలోనే మార్చి 15న ఇరు కుటుంబాలను పోలీసులు కౌన్సిలింగ్ కోసం పోలీసు స్టేషన్‌కు పిలిపించినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల పెద్దలు పోలీసు స్టేషన్‌లో పోలీసులతో మాట్లాడుతుండగానే వెయిటింగ్ రూమ్‌లో ఈ దాడి ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను పరిశీలిస్తే... స్వీటి బూర కుటుంబసభ్యులు, దీపక్ హుడా కుటుంబసభ్యులు ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. ఆ సమయంలోనే వారి మధ్య మొదలైన మాటల యుద్ధం దాడికి దారితీసింది. స్వీటి బూర ఆవేశంగా వెళ్లి దీపక్ పై దాడి చేశారు. అక్కడే ఉన్న ఇరు కుటుంబాలు ఎంతో కష్టపడి ఆమెను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించాయి.
🚨 World Champion Boxer Saweety Bora tried to assault her husband Kabbadi Star Deepak Hooda in Police Station
— The Khel India (@TheKhelIndia) March 25, 2025
They have reportedly filed for divorce!pic.twitter.com/TNEkdVujvU https://t.co/lzyyjeLv3W
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తరువాత స్వీటి మీడియాతో మాట్లాడారు. తనకు తన భర్త దీపక్ నుండి ప్రాణ హానీ ఉందని అన్నారు. తనకు ఏమైనా అయితే, అందుకు తన భర్త దీపక్‌తో పాటు హిసార్ జిల్లా ఎస్పీ కూడా బాధ్యులు అవుతారని ఆమె మీడియాకు తెలిపారు.
దీపక్ కెరీర్...
దీపక్ నివాస్ హుడా కెరీర్ విషయానికొస్తే... 2016 నాటి సౌత్ ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ గెల్చుకున్న భారత జట్టులో దీపక్ కూడా ఒకరు. 2014 లో ఏషియన్ గేమ్స్‌లో హుడా పాల్గొన్న భారత జట్టు కాంస్య పతకం గెల్చుకుంది. ప్రో కబడ్డీ లీగ్ టోర్నమెంట్స్‌లోనూ హుడా పాల్గొంటున్నాడు. 2024 లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రోహ్తక్ జిల్లా మెహం నియోజకర్గం నుండి దీపక్ హూడా బీజేపి తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు.