Cricket News: 'మీ మానవ జాతికి ఓ దండం..' అడవిలో ఇల్లు కొనుక్కున్న క్రికెటర్..!
Cricket News: కుటుంబ సమస్యలతో యోగ్‌రాజ్ అడవిలో నివాసం ఉంటున్నారు. వివాదాస్పద వ్యక్తిగా, అలాగే క్రికెట్ గురువుగా ఆయన జీవితం కొనసాగుతోంది.

Cricket News: 'మీ మానవ జాతికి ఓ దండం..' అడవిలో ఇల్లు కొనుక్కున్న క్రికెటర్..!
Cricket News: యోగ్‌రాజ్ సింగ్.. భారత క్రికెట్‌లో మంచి గుర్తింపు పొందిన మాజీ క్రికెటర్.. అలాగే వరల్డ్‌కప్ విజేత యువరాజ్ సింగ్ తండ్రి. ఇప్పుడు ఆయన మాట్లాడిన కొన్ని విషయాలు క్రికెట్ ప్రపంచంలో చర్చకు దారి తీశాచి. తన జీవితంలో ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొన్నట్టు యోగ్‌రాజ్ చెప్పారు. కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనలు తన మనశ్శాంతిని కుదిపేశాయట. అందుకే ఆయన తన స్నేహితులు, బంధువులు, ప్రపంచం అంతా దూరంగా ఉండాలనే ఉద్దేశంతో అడవిలో ఒక ఇంటిని కొనుగోలు చేశారు.
ఆ ఇంటిని కొనగానే అక్కడే నివసించడానికి నిర్ణయించుకున్నారు. ప్రకృతి మధ్య జీవితం ఆయనకు శాంతినిస్తుంది. తాను ఎప్పుడో పర్వతాలకు వెళ్లాలని, భగవంతునికి దగ్గరగా ఉండాలని కోరికగా ఉందని, ఇప్పుడు అది కొంతవరకూ నెరవేరిందనిపిస్తోంది. ఇదే సమయంలో యోగ్‌రాజ్ పాతకాలంలో జరిగిన కొన్ని విషయాలను కూడా గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఆయన గదిలో శివుడి విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేసేవారని చెప్పారు.
ఇంతకుముందు కూడా యోగ్‌రాజ్ వివాదాల్లో ఉండటం మనం చూశాం. ఆయన కొన్ని సందర్భాల్లో యువరాజ్ మీద లేదా భారత క్రికెట్ వ్యవస్థ మీద ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు రాజకీయ వ్యాఖ్యలతోనూ వార్తల్లోకి వచ్చారు. అయినా సరే, ఆయనకు క్రికెట్‌పై ఉన్న ప్రేమ మాత్రం మారలేదు. ఇప్పుడు కూడా ఆయన కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహిస్తూ, యువ క్రికెటర్లకు మార్గనిర్దేశం చేస్తున్నారు. అలాగే యువరాజ్ సింగ్ కూడా ఇప్పుడు యువ క్రికెటర్లకు మార్గదర్శకుడవుతున్నాడు. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ వంటి క్రికెటర్లకు ఆయన సహాయం చేసినట్లు యోగ్‌రాజ్ చెప్పారు. ఇది యువరాజ్ ప్రతిభను, క్రికెట్‌పై ఆయన అంకితభావాన్ని చూపిస్తోంది. పితా–పుత్రులిద్దరూ భిన్నమైన మార్గాల్లో ప్రయాణిస్తూ, క్రికెట్‌ను ప్రేమిస్తూ, తమదైన ముద్ర వేసుకుంటున్నారు.