Virat vs Ashutosh: విరాట్‌, అశుతోష్‌లలో అసలైన కింగ్‌ ఎవరు? ఈ లెక్కలు చూస్తే మ్యాటర్‌ మీకే అర్థమవుతుంది!

Virat Kohli vs Ashutosh Sharma: అశుతోష్ శర్మ తన తొలి 12 ఐపీఎల్ మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీ కన్నా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

Update: 2025-03-26 15:49 GMT
Virat Kohli vs Ashutosh Sharma

Virat vs Ashutosh: విరాట్‌, అశుతోష్‌లలో అసలైన కింగ్‌ ఎవరు? ఈ లెక్కలు చూస్తే మ్యాటర్‌ మీకే అర్థమవుతుంది!

  • whatsapp icon

Virat vs Ashutosh: ఐపీఎల్‌లో అశుతోష్ శర్మ తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కోసం మొదటి మ్యాచ్‌లోనే అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఢిల్లీ టీమ్ 65 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ కఠిన సమయంలో ఆశుతోష్ ఒంటరిగా నిలబడి 31 బంతుల్లో 66 పరుగులు చేసి జట్టును గెలుపుపథంలోకి తీసుకెళ్లాడు. ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడి ఈ ఏడాది ఢిల్లీకి రూ.3.8 కోట్లకు కొనబడిన అశుతోష్, తొలే మ్యాచ్‌లోనే తన విలువను నిరూపించాడు.

మరోవైపు, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తరఫున 18వ సీజన్ ఆడుతున్న విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్‌లోనే అర్ధశతకం చేశాడు. కానీ మొదటి 12 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో కోహ్లీ చేసింది 165 పరుగులే. ఆశుతోష్ ఆడిన 12 మ్యాచ్‌ల్లో 255 పరుగులు చేశాడు. ఈ లోపు అతడు రెండు అర్ధశతకాలు నమోదు చేశాడు. కోహ్లీకి అయితే ఆ దశలో ఒక్క అర్ధశతకమూ లేదు.

సగటు, స్ట్రైక్ రేట్ పరంగా చూస్తే అశుతోష్ స్పష్టంగా కోహ్లీ కంటే మెరుగుగా కనిపిస్తున్నాడు. 36.42 సగటుతో, 177.08 స్ట్రైక్ రేట్‌తో అశుతోష్ ఆకట్టుకుంటున్నాడు. మొదటి 12 మ్యాచ్‌ల్లో విరాట్ సగటు 16.5, స్ట్రైక్ రేట్ 105.76 మాత్రమే. ఈ ఆధారంగా చూస్తే ఆశుతోష్ మంచి ఆరంభం ఇచ్చాడు. మొత్తంగా చూస్తే విరాట్ కోహ్లీ అనుభవం ఉన్న ఆటగాడు. కానీ అశుతోష్ శర్మ ప్రారంభంలోనే తన ప్రతిభను చూపిస్తున్నాడు. భవిష్యత్తులో ఈ ఆటగాడు ఏ స్థాయికి వెళ్తాడో చూడాలి. ఢిల్లీ జట్టుకు గెలుపు తీరుపై అశుతోష్ కీలక పాత్ర పోషించనున్నాడు.

Tags:    

Similar News