IPL 2025: కోల్‌కతాపై నితీష్ రాణా ప్రతీకారం: భార్య ఆగ్రహానికి కారణమైన జట్టుపై లెక్క సరిచేసే సమయం!
IPL 2025 : ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఆరో మ్యాచ్ జరగనుంది.

IPL 2025: కోల్‌కతాపై నితీష్ రాణా ప్రతీకారం: భార్య ఆగ్రహానికి కారణమైన జట్టుపై లెక్క సరిచేసే సమయం!
IPL 2025 : ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఆరో మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు తమ తొలి మ్యాచ్‌లో ఓడిపోయాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టాలని చూస్తున్నాయి. అయితే, ఈ మ్యాచ్‌లో ఓ ఆటగాడు మాత్రం రెండు లక్ష్యాలతో బరిలోకి దిగుతున్నాడు. తన జట్టును గెలిపించడమే కాకుండా, తన భార్య ఆగ్రహానికి కారణమైన జట్టుపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నాడు. అతడే నితీష్ రాణా.
వివరాల్లోకి వెళితే.. నితీష్ రాణా 2018 నుంచి 2024 వరకు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడాడు. ఆ జట్టు తరఫున 2199 పరుగులు చేశాడు. అయితే, ఐపీఎల్ 2025 మెగా వేలంలో కోల్‌కతా యాజమాన్యం అతడిని రిటైన్ చేయలేదు, వేలంలో కూడా కొనుగోలు చేయలేదు. దీంతో నితీష్ రాణాకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లింది. గతంలో అతడికి 8 కోట్ల రూపాయలు వచ్చేవి, కానీ రాజస్థాన్ రాయల్స్ అతడిని 4.20 కోట్లకు మాత్రమే కొనుగోలు చేసింది. కోల్‌కతా యాజమాన్యం తనను పట్టించుకోకపోవడంతో నితీష్ రాణా భార్య సాచి మార్వా ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజాయితీకి విలువ లేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
నితీష్ రాణా కూడా కోల్‌కతా జట్టును అన్‌ఫాలో చేశాడు. ఇప్పుడు రాజస్థాన్, కోల్‌కతా జట్లు తలపడుతుండటంతో, నితీష్ రాణాకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ గువాహటిలో జరగనుంది. రెండు జట్లు తమ తొలి మ్యాచ్‌లో ఓడిపోయాయి. నితీష్ రాణా తన మాజీ జట్టుపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నాడు. నితీష్ రాణా ఈ మ్యాచ్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి. అతడు తన మాజీ జట్టుపై ప్రతీకారం తీర్చుకుంటాడా? లేదా అనేది చూడాలి.