GMR: మన గ్రంధి అంకూల్ ప్లాన్ మాములుగా ఉండదు.. స్కెచ్ వేస్తే ఎవరైనా షేక్ అవ్వాల్సిందే!
GMR: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వైజాగ్‌ను రెండో హోమ్‌గా ఎంచుకోవడంతో జట్టుకు భారీగా ఫ్యాన్స్ పెరిగారు. GMR ప్లాన్ సక్సెస్ అయ్యింది.

GMR: మన గ్రంధి అంకూల్ ప్లాన్ మాములుగా ఉండదు.. స్కెచ్ వేస్తే ఎవరైనా షేక్ అవ్వాల్సిందే!
GMR: ఐపీఎల్‌లో ఇప్పుడు కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలు వెచ్చించి జట్లను కొనుగోలు చేయడం మాత్రమే కాకుండా, ఆటలో హోమ్ అడ్వాంటేజ్ కోసం కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. టీమ్ హోమ్ మైదానం ఎక్కడ ఉంటే, అక్కడి పిచ్‌లు తమ బలాలకు తగినట్టుగా ఉండాలని చూస్తున్నారు. ఇలా చేస్తూ స్థానిక అభిమానులను పెంచుకోవడంలో కొంతవరకు విజయవంతమయ్యారు కూడా.
ఇదే ట్రెండ్‌లో కొన్ని జట్లు రెండో హోమ్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చాయి. రీసెంట్‌గా రాజస్థాన్ రాయల్స్ గువాహటిలో మ్యాచ్‌లు ఆడింది. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ అదే తరహాలో వైజాగ్‌ని రెండో హోమ్‌గా ప్రకటించింది. అసలు దీనికి కారణం ఢిల్లీ జట్టు ఓనర్ గ్రంధి మల్లికార్జున రావు. ఆయన వైజాగ్ పక్కన వున్న చిన్న ఊరికి చెందినవాడు. బిజినెస్‌లో పెద్ద విజయం సాధించి వేల కోట్లు సంపాదించాడు. ప్రస్తుతం ఈయన సంపద విలువ సుమారు 27,000 కోట్ల రూపాయలు.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పూర్వం నుంచి మంచి ఫ్యాన్ బేస్ లేక ఇబ్బంది పడుతోంది. విరాట్ కోహ్లీ ఢిల్లీకి చెందినవాడు అయినా, ఆడేది బెంగళూరు జట్టుకు కావడంతో చాలా మంది ఢిల్లీ అభిమానులు కూడా RCB ఫ్యాన్స్ అయిపోయారు. ఫ్యాన్ సపోర్ట్ లేకుండానే టీమ్ నడపడం కష్టమన్న అర్థంతో, మల్లికార్జున రావు తన కుమారుడు కిరణ్ కుమార్ తో కలిసి వైజాగ్‌లో మ్యాచ్‌లు నిర్వహించాలనుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైజాగ్‌లో మ్యాచ్‌లు మొదలయ్యాక, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఒక్కసారిగా ఫ్యాన్స్ పెరిగిపోయారు. మొన్న జరిగిన లక్నోతో మ్యాచ్ పూర్తి స్థాయిలో DC అభిమానులతో నిండిపోయింది. ఆ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత ఆ జట్టుపై అభిమానులు మరింతగా ఎగబడ్డారు. చివరికి జట్టుకి కొత్త ఊపు వచ్చింది. ఈ ప్రయత్నం ద్వారా GMR గ్రూప్ జట్టుకు కొత్త వేదిక ఇచ్చింది. IPL వంటి పోటీకి ఇది నిజంగా ఓ మంచి మోడల్ అయింది. వైజాగ్ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు రెండో ఇల్లు లాంటిదే.