Harbhajan Singh: ఎందుకింత పైత్యం..? భజ్జీ బజ్జీలు వేసుకోవాల్సిందేనా? హర్భజన్ సింగ్‌పై వేటు తప్పదా?
Harbhajan Singh: జాతిపరమైన వ్యాఖ్యలపై ఇప్పటికే కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నాయి. అలాంటప్పుడు ఒక మాజీ ఆటగాడిగా హర్భజన్ బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని అభిమానులు చెబుతున్నారు.

Harbhajan Singh: ఎందుకింత పైత్యం..? భజ్జీ బజ్జీలు వేసుకోవాల్సిందేనా? హర్భజన్ సింగ్‌పై వేటు తప్పదా?
Harbhajan Singh: క్రికెట్‌లో ఎన్నో విజయాలు సాధించిన హర్భజన్ సింగ్‌కు వివాదాలు కొత్తేమీ కావు. ఆటలో ఉన్నప్పటికీ, ఆటకు దూరమైన తర్వాత కూడా ఆయన తలపోయే సమస్యల మధ్యే నడుస్తున్నాడు. తాజాగా 2025 ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా పాల్గొన్న భజ్జీ మరోసారి వివాదాస్పదంగా మారాడు.
చెన్నై-ముంబై మ్యాచ్‌లో కామెంటరీ చేస్తున్న హర్భజన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌పై వ్యాఖ్యానిస్తూ, ఆయనను 'కాలీ ట్యాక్సీ'తో పోల్చాడు. లండన్‌లో బ్లాక్ ట్యాక్సీలకు 'కాలీ' అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఈ కామెంట్‌లోని భావం ఆర్చర్ జాతిపై ఉద్దేశించిందని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో హర్భజన్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన్ను కామెంటరీ ప్యానెల్ నుంచి తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇది భజ్జీ కెరీర్‌లో మొదటి వివాదం కాదనే విషయం తెలిసిందే.
గతంలో 2008లో జరిగిన ఆస్ట్రేలియా టూర్ సందర్భంగా కూడా హర్భజన్ జాత్యహంకార వ్యాఖ్యల ఆరోపణలతో వార్తల్లోకి ఎక్కాడు. ఆండ్రూ సైమండ్స్‌తో మ్యాచ్ సమయంలో జరిగిన ఘర్షణలో ఆయన 'మంకీ' అన్నాడని సైమండ్స్ ఆరోపించారు. ఆ సమయంలో భారత జట్టు, బీసీసీఐ హర్భజన్‌కు మద్దతుగా నిలిచినా, అతనిపై జరిమానా మాత్రం విధించారు. ఆ సంఘటన అప్పట్లో భారత్-ఆస్ట్రేలియా సంబంధాలకే గండికొట్టింది. ఇప్పుడు మళ్లీ ఆ తరహా ఆరోపణలు హర్భజన్‌పై రావడంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు.