IPL 2025: ఐపీఎల్లో ఓ అరుదైన రికార్డ్ ...తొలి ఆటగాడిగా హిస్టరీ క్రియేట్ చేసిన కింగ్ కోహ్లీ

IPL 2025: ఐపీఎల్ 18వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంచి శుభారంభాన్ని ఇచ్చింది. డిఫెడింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైర్స్ పై 7 వికెట్ల తేడాతో భారీ విజయం అందుకుంది. 175 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఆర్సిబీ 16.2ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. విరాట్ కోహ్లీ 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ లతో దుమ్మురేపాడు. ఫిల్ సాల్ట్ 31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సెక్సులతో ఉతికారేసాడు. ఈ ఇన్నింగ్స్ తో కోల్ కతాపై కోహ్లీ 1000 పరుగులు పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే విరాట్ ఐపీఎల్ లో ఓ అరుదైన రికార్డు ను అందుకున్నాడు.
నాలుగు జట్లపై 1000కిపైగా రన్స్ చేసిన తొలి బ్యాటర్ రికార్డ్ క్రియేట్ చేశాడు. మ్యాచుకు ముందు కోల్ కతాపై విరాట్ 962 పరుగులు ఉండగా..ఇన్నింగ్స్ పదో ఓవర్ లో 1000 పరుగుల మార్క్ దాటాడు. ఇంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటర్స్, పంజాబ్ కింగ్స్ పై కోహ్లీ 1000కి పైగా పరుగులు చేశాడు. అంతేకాదు కేకేఆఱ్ పై 1000 పరుగులు చేసిన మూడో ఆటగాడిగా విరాట్ నిలిచాడు. డేవిడ్ వార్నర్ 1093, రోహిత్ శర్మ 1070, కోహ్లీ కంటే ముందు ఈ ఫీట్ సాధించారు.
ఈ మ్యాచ్ తో విరాట్ కోహ్లీ తన కెరీర్ లో 400వ టీ20 మ్యాచ్ ఆడుతున్నాడు. దీనితో, అతను క్రికెట్ అతి తక్కువ ఫార్మాట్‌లో 400 మ్యాచ్‌లు ఆడిన మూడవ భారతీయ ఆటగాడిగా నిలిచాడు. అతని కంటే ముందు రోహిత్ శర్మ (448 మ్యాచ్‌లు), దినేష్ కార్తీక్ (412 మ్యాచ్‌లు) ఈ ఘనత సాధించారు.
అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాళ్లు
రోహిత్ శర్మ – 448
దినేష్ కార్తీక్ – 412
విరాట్ కోహ్లీ - 399 ( 400వ మ్యాచ్ )
మహేంద్ర సింగ్ ధోని – 391
సురేష్ రైనా – 336
విరాట్ కోహ్లీ ప్రస్తుతం 399 టీ20 మ్యాచ్‌ల్లో 12,886 పరుగులు చేశాడు. 13,000 పరుగులు పూర్తి చేయడానికి అతనికి ఇంకా 114 పరుగులు మాత్రమే అవసరం. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 114 పరుగులు చేస్తే, ప్రపంచంలో ఈ ఘనత సాధించిన 5వ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్:
క్రిస్ గేల్ - 14,562 పరుగులు
అలెక్స్ హేల్స్ - 13,610 పరుగులు
షోయబ్ మాలిక్ - 13,537 పరుగులు
కీరాన్ పొలార్డ్ - 13,537 పరుగులు
డేవిడ్ వార్నర్ - 12,913 పరుగులు
విరాట్ కోహ్లీ - 12,886 పరుగులు ( 114 పరుగుల దూరంలో )