SRH vs RR Match: ఆదిలోనే రాజస్థాన్ రాయల్స్ వెన్ను విరిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్

Update: 2025-03-23 13:13 GMT
SRH vs RR match, RR batting against SRH in Uppal Hyderabad stadium

SRH vs RR Match: ఆదిలోనే రాజస్థాన్ రాయల్స్ వెన్ను విరిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్

  • whatsapp icon

SRH vs RR match, RR batting against SRH in Uppal Hyderabad stadium: సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్‌లోనే కాదు... బౌలింగ్‌లోనూ రెచ్చిపోతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసిన విషయం తెలిసిందే. 287 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ జట్టును హైదరాబాద్ బౌలర్ల మాయాజాలం ముందు నిలువలేకపోతోంది. పవర్ ప్లే ఇంకా పూర్తి కాక ముందే రాజస్తాన్ రాయల్స్ జట్టు 77 పరుగులతే 3 వికెట్లు కోల్పోయింది. సిమర్జీత్ సింగ్ బౌలింగ్ లో యశస్వి జైశాల్ కొట్టిన బంతిని అభినవ్ మనోహర్ క్యాచ్ పట్టుకున్నాడు. దాంతో యశస్వి 1 పరుగుకే పెవిలియన్ బాటపట్టాడు.

ఆ తరువాత రియాన్ పరాగ్ కూడా సిమర్జీత్ సింగ్ బౌలింగ్ లోనే 4 పరుగులకే ప్యాట్ కమ్మిన్స్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అనంతరం నితీష్ రానా కూడా వారి బాటలోనే 11 పరుగులకే మొహమ్మద్ షమీ బౌలింగ్ లో కమ్మిన్స్ కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో స్వల్ప స్కోర్ కు ముగ్గురు ఆటగాళ్లు ఔట్ అవడంతో ఇంపాక్ట్ ప్లేయర్ సంజూ శాంసన్ పై జట్టును గెలిపించే భారం పడింది.

సంజూ శాంసన్ 26 బంతుల్లోనే 50 పరుగులు ( 6 ఫోర్లు, 3 సిక్సులు) చేసి హాఫ్ సెంచరీ చేయడమే కాకుండా జట్టు స్కోర్ బోర్డ్ ను పరుగెత్తించే పనిలో పడ్డాడు. సంజూ శాంసన్ క్రీజులో ఉన్నంత వరకు ఆ జట్టుకు వచ్చిన టెన్షన్ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, జోష్ మీదున్న సంజూను కూడా పెవిలియన్ బాట పట్టించాలని సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్ ప్రయత్నిస్తున్నారు.

Tags:    

Similar News