CT 2025: ఐపీఎల్ స్టార్ట్ అయినా ఇంకా ఆగని ఛాంపియన్స్ ట్రోఫీ రచ్చ.. ఇండియన్ మీడియా వర్సెస్ పాక్ క్రికెట్ బోర్డు!
CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీ వల్ల పీసీబీకి రూ.869 కోట్ల నష్టం అనే వార్తలు వాస్తవం కాదని, ఇది భారత మీడియా ప్రచారం మాత్రమేనని పాక్ బోర్డు ఘాటుగా ఖండించింది.

CT 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్ భారత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్‌ను పాకిస్తాన్ హోస్ట్ చేసినా, భారత జట్టు మ్యాచులు మాత్రం దుబాయ్‌లో జరగటం కలకలం రేపింది. పాక్ జట్టు గ్రూప్ స్టేజిల్లోనే ఔట్ అయింది. టోర్నీ ముగిసిన వెంటనే కొన్ని భారత మీడియా రిపోర్ట్స్‌లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB)కి రూ. 869 కోట్ల భారీ నష్టం వచ్చిందని ప్రచారం మొదలైంది. కానీ, దీనిపై పీసీబీ అధికార ప్రతినిధులు స్పందించారు. ఇది నిజం కాదని తేల్చిచెప్పేశారు.
లాహోర్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో, పీసీబీ అధికార ప్రతినిధి ఆమీర్ మిర్, ఆర్థిక శాఖ అధిపతి జావేద్ ముర్తజా ఈ వార్తలపై ఘాటుగా స్పందించారు. 'ఇది పూర్తిగా భారత మీడియా చారిత్రకంగా తీసుకున్న ప్రచారం. నిజానికి ఈ టోర్నమెంట్ వల్ల మేం గణనీయమైన లాభాల్లో ఉన్నాం' అని తేచెప్పారు. ఐసీసీ మొత్తం టోర్నీ ఖర్చులను భరించిందని, పీసీబీ టికెట్ అమ్మకాలు, గేట్ రెసిప్ట్‌ల వలన మంచి ఆదాయం సంపాదించిందని వివరించారు.
అంతేకాదు, తాజా ఆడిట్ ప్రకారం పీసీబీకి ఐసీసీ నుంచి మరో PKR 300 కోట్లు (భారత రూపాయలలో సుమారు రూ. 900 కోట్లు) వచ్చే అవకాశముందని చెప్పారు. దీంతో నష్టం కాదు, లాభమే జరిగిందని స్పష్టమవుతోంది.
ఇక మరో కీలక అంశం ఏమిటంటే.. భారత్, పాకిస్తాన్ మధ్య 2027 వరకు ప్రత్యక్ష టూర్లు ఉండవని, ఐసీసీ స్థాయిలో ఒక ఒప్పందం ప్రకారం, తటస్థ వేదికలపై మాత్రమే రెండు జట్లు తలపడతాయని స్పష్టం చేశారు. అందుకే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచులు దుబాయ్‌లో జరిగాయి. అలాగే 2026 టీ20 వరల్డ్ కప్‌లో భారత్ -పాకిస్తాన్ మ్యాచ్ కొలంబోలో జరగనుంది.