IPL 2025: ముంబై, సీఎస్కే మ్యాచ్ కు ముందు అభిమానులకు బ్యాడ్ న్యూస్.. లాస్ట్ మినిట్లో మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్
IPL 2025: ఐపీఎల్ 2025 లో ఈరోజు అంటే మార్చి 23న ఒక ఓ పెద్ద మ్యాచ్ జరగనుంది. సాయంత్రం జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.

IPL 2025: ముంబై, సీఎస్కే మ్యాచ్ కు ముందు అభిమానులకు బ్యాడ్ న్యూస్.. లాస్ట్ మినిట్లో మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్
IPL 2025: ఐపీఎల్ 2025 లో ఈరోజు అంటే మార్చి 23న ఒక ఓ పెద్ద మ్యాచ్ జరగనుంది. సాయంత్రం జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ను 'ఎల్ క్లాసికో' అని కూడా పిలుస్తారు. దీని అర్థం క్లాసిక్ మ్యాచ్. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ చెన్నైలోని చేపాక్ స్టేడియంలోని ఎంఏ చిదంబరంలో జరుగుతుంది. ముంబై, సీఎస్కే మధ్య జరిగే మ్యాచ్ కోసం అభిమానులు ఎప్పుడూ ఎదురు చూస్తారు. కానీ ఈ పెద్ద మ్యాచ్ కు ముందు, క్రికెట్ అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ అందింది.
ఈ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ అత్యంత విజయవంతమైన జట్లు. రెండు జట్లు చెరో 5 సార్లు టైటిల్ గెలుచుకున్నాయి. ఈ జట్లు ఒకదానికొకటి తలపడినప్పుడల్లా, గట్టి పోటీ కనిపిస్తుంది. కానీ ఈసారి వర్షం చెన్నై, ముంబై మ్యాచ్‌కు అంతరాయం కలిగించవచ్చు. వాతావరణ నివేదిక ప్రకారం, ఈరోజు చెన్నైలో వర్షం పడే అవకాశం 80శాతం ఉంది. చెన్నైలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. అయితే, మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం 20 శాతం మాత్రమే. ఉష్ణోగ్రత 27 నుండి 33 డిగ్రీల మధ్య ఉంటుందని అంచనా.
సాయంత్రం వర్షం పడితే, అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటం వల్ల మ్యాచ్ ఆలస్యం కావచ్చు. మ్యాచ్ సమయంలో వర్షం పడితే, అభిమానులు గుండెలు బాదుకోవచ్చు. ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లో కూడా వర్షం ముప్పు ఉంది. కాని అదృష్టవశాత్తు కోల్‌కతాలో ఆట సమయంలో వర్షం పడలేదు.
చెన్నై సూపర్ కింగ్స్ సొంతగడ్డపై ముంబై ఇండియన్స్ ఆధిపత్యం చెలాయించింది. ఎంఏ చిదంబరం స్టేడియంలో రెండు జట్ల మధ్య మొత్తం 8 మ్యాచ్‌లు జరిగాయి. ముంబై 5 మ్యాచ్‌ల్లో గెలిచింది. సీఎస్కే జట్టు 3 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది.రెండు జట్లు ఐపీఎల్‌లో మొత్తం 37 సార్లు తలపడ్డాయి. వీటిలో 20 ముంబై జట్టు, 17 చెన్నై జట్టు గెలిచాయి. అంటే చెన్నైపై ముంబై ఎప్పుడూ పైచేయి సాధించింది. కానీ గత కొన్ని మ్యాచ్‌లలో దీనికి విరుద్ధంగా కనిపించింది. గత మూడు మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది.
రెండు జట్లలో 12 మంది ఆడే అవకాశం ఉంది
చెన్నై సూపర్ కింగ్స్: రితురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, శివం దుబే, సామ్ కుర్రాన్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, మతిష్ పతిరానా.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, రాబిన్ మింజ్ (వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, ముజీబ్ ఉర్ రెహమాన్, కర్ణ్ శర్మ.