SRH: తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ స్ట్రాటజీ ఏంటి? గెలవాలంటే ఏం చేయాలి?
సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉంది.

SRH: ఉప్పల్ స్టేడియం ఈ ఆదివారం క్రికెట్ వేడుకకు సిద్ధమవుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ఐపీఎల్ 2025 ప్రయాణాన్ని రాజస్థాన్ రాయల్స్‌తో ఆరంభించనుంది. అభిమానులు పూర్తి ఉత్సాహంతో జట్టుకు మద్దతు అందించడానికి ఎదురు చూస్తున్నారు. స్టేడియం మొత్తం ఆరంజ్ రంగుతో నిండిపోనున్నది.
ఇక సన్‌రైజర్స్ టాప్ ఆర్డర్ పేలవంగా ఉన్న మాట నిజం కానీ, టాప్ ఆర్డర్ మాత్రం విరుచుకుపడతారని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ లాంటి బ్యాట్స్‌మెన్ జట్టుకు అద్భుతమైన శుభారంభం ఇవ్వగలరనే నమ్మకం ఉంది. గత సీజన్‌లో దుమ్మురేపిన ఈ జోడీ మళ్లీ అదే మోత మోగిస్తుందా అన్నది చూడాలి. మిడిలార్డర్‌లో హెన్రిక్ క్లాస్సేన్, నితీష్ రెడ్డి, అభినవ్ మనోహర్ కీలకంగా మారబోతున్నారు. క్లాస్సేన్ మెచ్యూర్డ్ ప్లేయర్, అవసరమైన వేళ జట్టును ముందుకు నడిపించగలడు. ఇక నితీష్ రెడ్డి నాటౌట్ ఇన్నింగ్స్‌లు ఆడే సామర్థ్యం ఉన్న ఆటగాడు. అభినవ్ మనోహర్ కొత్తగా జట్టులోకి వచ్చాడైనా, అతని హిట్టింగ్ సామర్థ్యం ఫాన్స్‌కు కొత్తేమీ కాదు.
SRH బౌలింగ్ దళం చూస్తే కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. భువనేశ్వర్ కుమార్ గైర్హాజరీ SRH పేస్ దళానికి పెద్ద దెబ్బనే చెప్పాలి. మొహమ్మద్ షమీ లాంటి అనుభవజ్ఞుడిని జట్టులోకి తీసుకున్నా, అతని ఫిట్‌నెస్ పరిస్థితిపై సందేహాలే ఉన్నాయి. షమీ పూర్తిగా ఫిట్‌గా ఉంటే, అతని యార్కర్లు, బౌన్సర్లు ప్రత్యర్థులకు కష్టం కలిగిస్తాయి. హర్షల్ పటేల్ వైవిధ్యమైన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను చిక్కుల్లో పెట్టగలడు. పాట్ కమ్మిన్స్ లీడర్‌గా జట్టును నడిపించడంతో పాటు కీలక వికెట్లు తీయాల్సిన బాధ్యతను కూడా భుజానికెత్తుకోవాలి. స్పిన్ విభాగంలో రాహుల్ చాహర్, ఆడమ్ జాంప తుది జట్టులో ఒకరి స్థానం ఖాయమే.