IPL Auction 2025: ఐపీఎల్ మిస్టరీ గర్ల్స్.. ఈ సారి ఎవరు కనిపిస్తారో!
IPL Auction 2025: ఐపీఎల్ మాయలో కెమెరా క్లిక్‌తో వెలుగులోకి వచ్చిన మిస్టరీ గర్ల్స్ ఇప్పుడు స్టేడియం కంటే సోషల్ మీడియాలో బిజీగా మారారు. 2025 సీజన్‌లో వీళ్ల స్పార్క్ మళ్లీ కనిపించనుంది.

IPL Auction 2025: ఐపీఎల్ మిస్టరీ గర్ల్స్.. ఈ సారి ఎవరు కనిపిస్తారో!
IPL Auction 2025: ఐపీఎల్ అంటే కేవలం క్రికెట్‌నే కాదు... కళల మేళా కూడా. బ్యాటింగ్, బౌలింగ్ లాంటివి ఒక్క వైపు అయితే.. మరోవైపు ప్రేక్షకుల కళ్లను ఆకట్టుకుంటూ, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే 'మిస్టరీ గర్ల్స్' మరోవైపు. స్టాండ్స్‌లో కనబడటమో, ఆటగాళ్లతో ట్రావెల్ చేయడమో, లేదా ఒక్కసారిగా కెమెరా ఫోకస్ పడటమో – ఇలా ఒక్క క్షణం చాలూ.. క్రౌడ్ పుల్ చేసే హార్ట్‌బీట్‌లా మారిపోతారు అమ్మాయిలు. ఈసారి ఎవరు కనిపిస్తారో ఏమో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేసిన మిస్టరీ గర్స్‌పై ఓ లుక్కేద్దాం!
సీజల్ జైస్వాల్ :- ముంబై ఇండియన్స్ ఆటగాళ్లతో దర్శనం ఇచ్చిన ఈ బ్యూటీ మొదట కెమెరాలో కనిపించగానే అందరి దృష్టిని ఆకర్షించింది. పీఆర్ కన్సల్టెంట్‌గా ఆమె పాత్ర ఉన్నప్పటికీ, ఇషాన్ కిషన్, బుమ్రా వంటి ప్లేయర్లతో ఫోటోలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో చర్చలు మాండాయి. కానీ ఆమె కెరీర్ యాక్ట్రెస్ గానూ నడుస్తోంది.
శృతి తులీ :- చెన్నై సూపర్ కింగ్స్‌కు ఫ్యాన్ గర్ల్‌గా కనిపించి ఒక్క సిక్స్‌కు ఇచ్చిన రియాక్షన్‌తో సెన్సేషన్ అయింది. మిస్ ఇండియా డివా 2013 పోటీలో పాల్గొన్న ఈ మోడల్ ప్రస్తుతం ఇన్‌స్టాలో 1.2 లక్షల ఫాలోవర్స్‌తో బిజీగా ఉన్నారు.
శశి ధిమాన్ :- పంజాబ్ కింగ్స్ కోసం సోషల్ మీడియా కంటెంట్ చేయడం ద్వారా ఫాలోయింగ్ తెచ్చుకున్న స్టాండ్‌అప్ కామెడియన్. చండీఘఢ్ నుంచి ముంబైకి షిఫ్ట్ అయి, వెనుకడుగు లేకుండా తన హాస్యంతో ఐపీఎల్ అభిమానుల్లో స్థానం సంపాదించుకుంది.
ఇషా నేగీ :- ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రిషభ్ పంత్‌కు ఎమోషనల్ సపోర్ట్‌గా నిలిచిన ఈమె, 2022 సీజన్ నుంచి ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. పంత్‌కు జరిగిన యాక్సిడెంట్ తరువాత ఆమె మద్దతు మరింత హైలైట్ అయింది.
అదితి హుండియా :- మిస్ దివా 2018 టైటిల్ విన్నర్, ఫెమినా మిస్ ఇండియా 2017 ఫైనలిస్ట్. ఇషాన్ కిషన్‌కు సపోర్ట్‌గా మైదానంలో కనిపించడంతో ఆమెపై కూడా అభిమానుల ఆసక్తి పెరిగింది.