SRH: కావ్య మారన్ కార్లు చూశారా? అమ్మ బాబోయ్ గరేజ్ నిండా లగ్జరీ కలెక్షన్సే..!
SRH Kavya Maran Car Collections: కావ్య మారన్ సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓ ఎప్పుడూ హైలెట్టే.. కేవలం ఐపీఎల్ మాత్రమే కాదు.. ఆమె కార్ కలెక్షన్స్ చూస్తే మైండ్ బ్లాక్ అంతే..

SRH: కావ్య మారన్ కార్లు చూశారా? అమ్మ బాబోయ్ గరేజ్ నిండా లగ్జరీ కలెక్షన్సే..!
SRH Kavya Maran Car Collections: సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) నిన్న ఆదివారం ఐపీఎల్ 20 మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR)తో గెలిచి ఫుల్ ఖుష్‌లో ఉన్నారు ఆరేంజ్ ఆర్మీ. ఇక ఈ జట్టు సీఈఓ విషయానికి వస్తే ఎప్పుడు సన్ రైజర్స్ మ్యాచ్ జరిగినా వార్తల్లో నిలుస్తారు. తన హావభావలతో అందరి దృష్టిని ఆకట్టుకుంటారు. ఈ విధంగా తనకు ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అయితే, కావ్య ఐపీఎల్ మాత్రమే కాదు ఆమె లగ్జరీ కార్ కలెక్షన్స్‌కు కూడా ప్రత్యేకంగా నిలుస్తారు. కళానిధి మారన్ కూతరే కావ్య మారన్ అని మనందరికీ తెలిసిందే. ఈమె నెట్ వర్త్ రూ.400 కోట్లు పైగానే ఉంటుంది.
రోల్స్ రాయిస్ ఫ్యాన్‌టమ్ VIIIB..
కావ్య మారన్ కార్ కలెక్షన్‌లో లగ్జరీ కార్ రోల్స్ రాయిస్ ఫ్యాన్‌టమ్ VIII EWB ప్రత్యేకం. దీని ధర మన దేశంలో రూ.12.2 కోట్లు ఉంటుందట. ఇది లేత బంగారు వర్ణం, నలుపు కలిసి 21 ఇంచుల చక్రాలు కలిగి ఉంటాయి. అంతేకాదు 6.75 లీటర్ V12 ట్విన్ టర్బో ఛార్జ్ ఇంజిన్ కలిగి ఉంటుంది. అంతేకాదు 571 hp పవర్‌తోపాటు 900Nm టార్క్యూ కలిగి ఉంటుంది.
బెంట్లీ (Bentayga EWB)..
బెంట్లీ కారు కూడా కావ్య మారన్ కలెక్షన్స్‌లో ఉంది. ఈ బ్రాండ్ తయారు చేసిన మొదటి SUV కూడా ఇదే.. కావ్య దగ్గర ఎరుపు రంగులో ఉండే బెంట్లీ ఉంది. ఈ కారు చక్రాలు కూడా 22 ఇంచులు ఉంటుంది.దీని ధర రూ.6 కోట్లు ఉంటుందట. ఇక ఈ బెంట్లీ SUV 4 లీటర్ల ట్విన్ టర్బో V8 ఇంజిన్ ఉంటుందట. ఇది కూడా 8 స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ కారు. దీని hp 542, 770 Nm పీక్ టార్క్యూ ఉంటుంది.
బీఎండబ్ల్యూ i7..
కావ్య పాప కార్ల ఖాతాలో బీఎండబ్ల్యూ కూడా ఉంది. ఈ బ్రిటీషు తయారీదారు కంపెనీకి చెందిన కారు బవారియన్ జెయంట్ బ్యాడ్జ్ కలిగి ఉంటుంది. బ్లాక్ సఫైర్ మెటాలిక్ పెయింట్‌తో ఉండే ఈ కారు లగ్జరీ సెడాన్ కారు. ఇందులో డ్యుయల ఎలక్ట్రిక్ మోటర్ సెటప్ ఉంటుంది. 101.7 kWh బ్యాటరీతో 603 కీమీ సింగిల్ ఛార్జీతో దూసుకెళ్తుంది.
ఫెర్రారీ రోమా..
ఫెర్రారీ రోమా కారు కూడా కావ్య మారన్ గరేజ్‌లో ఉంది. దీన్ని ప్రారంభంలో రూ.4.5 కోట్లకు ప్రారంభించారు. ఇది 3.9 లీటర్ల ట్విన్ టర్బో ఛార్జింగ్ V8 కారు. 8 స్పీడ్ డ్యుయల క్లచ్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ కారు. 680 hp, 760 Nm పీక్ టర్క్యూ.