CSK vs MI: చెన్నైని బ్యాన్ చేయాలని ఫ్యాన్స్ మరోసారి డిమాండ్.. ముంబైపై మ్యాచ్‌లో భారీ మోసం?
CSK vs MI: బాల్ ట్యాంపరింగ్ చేయడానికి ఆటగాళ్లు అనేక మార్గాలను ఉపయోగిస్తారు. వాటిలో మైనసుపాటి వస్తువులతో స్క్రాచ్ చేయడం, గాజు లాంటి పదార్థాలతో రుద్దడం, చేతికి ఉండే లోషన్‌లు లేదా ఇతర రసాయనాలు వాడటం లాంటివి ఉంటాయి.

CSK vs MI: చెన్నైని బ్యాన్ చేయాలని ఫ్యాన్స్ మరోసారి డిమాండ్.. ముంబైపై మ్యాచ్‌లో భారీ మోసం?
CSK vs MI: ఎందుకో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఇతర జట్ల అభిమానులకు నమ్మకం తక్కువ. స్పాట్ ఫిక్సింగ్-బెట్టింగ్ ఆరోపణలుతో ఆ జట్టు గతంలో రెండేళ్లు ఐపీఎల్ నుంచి బ్యాన్ అవ్వడం దీనికి ప్రధాన కారణం. అప్పటినుంచి చెన్నై ఆడే మ్యాచ్‌ల్లో ఏదైనా అనుకోని వింత ఘటనలు జరిగితే ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో రెచ్చిపోయి పోస్టులు పెడుతుంటారు. చెన్నై జట్టును బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తుంటారు. మరోసారి కూడా అదే జరిగింది. చిరకాల ప్రత్యర్థి ముంబైపై జరిగిన మ్యాచ్ వివాదానికి కారణమైంది. మ్యాచ్ ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. చెన్నై బౌలర్ ఖలీల్ అహ్మద్ తన జేబులోని తెల్లటి వస్తువును కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు ఇస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. ఖలీల్ ఇచ్చిన వస్తువును రుతురాజ్ తన పాకెట్లో పెట్టుకున్నాడు. ఈ ఘటనను బాల్ ట్యాంపరింగ్‌గా ముంబైతో పాటు ఇతర జట్ల అభిమానులు అనుమానిస్తున్నారు.
ఈ వీడియో చూసిన తర్వాత ముంబై ఫ్యాన్స్ CSKపై కోపంతో సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. కొందరు చెన్నైని IPL నుంచి బ్యాన్ చేయండని డిమాండ్ చేస్తున్నారు. ఇది కేవలం అభిమానుల కోపమా లేదా నిజంగా ఏదైనా చీటింగ్ చేశారా అన్నది తేలాల్సి ఉంది. BCCI లేదా IPL అధికారులు ఇంకా ఈ విషయంపై ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. ఈ ఆరోపణలే నిజమైతే ఇది మరో పెద్ద రచ్చకు దారి తియ్యడం పక్కా. ఎందుకంటే IPLలో చెన్నై, రాజస్థాన్ జట్లు చేసిన నిర్వాకం కారణంగా గతంలో ఈ లీగ్‌పై చాలా మందికి ఇంట్రెస్ట్ పోయింది. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ కథ సాధారణ స్థితికి వచ్చింది.
ఇక క్రికెట్‌లో బాల్ ట్యాంపరింగ్ అంటే బంతిని కృత్రిమంగా మార్చడం ద్వారా బౌలర్‌కు అనుకూలంగా పరిస్థితులు సృష్టించే ఒక నిషిద్ధ పద్ధతి. బంతిపై ఉన్న కవర్‌ను ఏదైనా పదార్థంతో రాపిడి చేయడం ద్వారా బాల్‌ను అదనంగా స్వింగ్ చేయవచ్చు. బాల్ ట్యాంపరింగ్ చేయడానికి ఆటగాళ్లు అనేక మార్గాలను ఉపయోగిస్తారు. వాటిలో మైనసుపాటి వస్తువులతో స్క్రాచ్ చేయడం, గాజు లాంటి పదార్థాలతో రుద్దడం, చేతికి ఉండే లోషన్‌లు లేదా ఇతర రసాయనాలు వాడటం, నోటితో కొరకడం లాంటి చర్యలు ఉంటాయి. ఇలాంటి చర్యలు ఐసీసీ నిబంధనల ప్రకారం పూర్తిగా నిషేధం. బాల్ ట్యాంపరింగ్ చేసినట్లు ప్రూవ్ అయితే సంబంధిత ఆటగాళ్లకు నిషేధం, జరిమానాలు లాంటి కఠిన శిక్షలు విధిస్తారు. గతంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కెమెరాన్ బాంక్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్ కారణంగా భారీ శిక్షలు ఎదుర్కొన్నారు.