SRH: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్.. రూ.5 కోట్లు ఖర్చు.. స్టేడియంలో పండుగే!

ఐపీఎల్‌లో SRH మరింత ముందుకు రావాలంటే, హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉండాలి.

Update: 2025-03-21 04:27 GMT
SRH 5 Crore Uppal Stadium Money Spend

SRH: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్.. రూ.5 కోట్లు ఖర్చు.. స్టేడియంలో పండుగే!

  • whatsapp icon

SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి కప్ గెలవాలని సిద్ధమవుతోంది. కానీ అందుకు ముందు స్టేడియం నుంచే విజయం కోసం కీలకమైన పనులు పూర్తయ్యాయి. ఉప్పల్ స్టేడియం ఈసారి SRHకి కోటగా మారేలా మెరుగుదల పనులు జరిగాయి. స్టేడియం పునరుద్ధరణ కోసం అక్షరాలా రూ.5 కోట్లు ఖర్చు అయ్యాయి. ఇది కేవలం HCA ఖర్చు చేసిన మొత్తం మాత్రమే కాదు, సన్‌రైజర్స్ మేనేజ్మెంట్ కూడా భారీగా సహాయపడింది.

స్టేడియాన్ని పూర్తిగా కొత్తరూపం ఇవ్వడానికి చేపట్టిన పనుల్లో ప్లేయర్స్ డ్రెస్సింగ్ రూమ్స్‌లో అదనపు ACలు ఏర్పాటు చేయడం, కార్పొరేట్ బాక్స్ విస్తరించడం, ఫ్యాన్స్ కోసం కొత్త ఫెసిలిటీస్ అందించడం ఉన్నాయి. నార్త్ స్టాండ్‌లో కొత్త రెస్ట్ రూమ్స్ నిర్మించడంతో పాటు మొత్తం స్టేడియాన్ని మళ్లీ పెయింట్ చేయడం ద్వారా కొత్త లుక్ ఇచ్చారు.

ఈ పనుల వెనుక SRH యాజమాన్యం ముఖ్య భూమిక పోషించింది. సన్ నెట్‌వర్క్ హైదరాబాద్ జట్టును ఎంతగానో ప్రోత్సహిస్తూ, అవసరమైన చోట సహాయం అందిస్తోంది. కావ్య మారన్, ఆమె మేనేజ్మెంట్ ఈ పనుల్లో ప్రత్యక్షంగా చేరడంతో, స్టేడియం అభివృద్ధి వేగంగా పూర్తయ్యింది. ఐపీఎల్‌లో SRH మరింత ముందుకు రావాలంటే, హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉండాలి. అదే దిశగా మేనేజ్మెంట్ ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా పని చేసింది.

ఇంతటి పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయడం వెనుక SRH ఫ్యాన్స్‌కి మంచి అనుభవం కల్పించాలన్న లక్ష్యం ఉంది. స్టేడియం పూర్తిగా సిద్దమై, SRH తొలి హోం మ్యాచ్‌లో గెలుపు ఆరంభాన్ని అందుకుంటుందా అన్నది చూడాలి. ఆరంజ్ ఆర్మీ స్టేడియంలో మోత మోగించడానికి సర్వం సిద్ధం. ఈసారి టైటిల్‌ కోసం SRH మరింత దూకుడుగా ముందుకు సాగుతుందా? ఏమో చూడాలి!

Tags:    

Similar News