IPL 2025: ఫస్ట్ టైం ఐపీఎల్ లో ఓ స్పెషాలాటీ కనిపించబోతుంది.. అది ఏంటంటే ?

IPL 2025: మరికొద్ది గంటల్లో క్రికెట్ ప్రేమికులను నిజమైన పండుగ మొదలు కాబోతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ మార్చి 22 నుండి ప్రారంభం కానుంది.

Update: 2025-03-21 12:44 GMT
IPL 2025

IPL 2025: ఫస్ట్ టైం ఐపీఎల్ లో ఓ స్పెషాలాటీ కనిపించబోతుంది.. అది ఏంటంటే ?

  • whatsapp icon

IPL 2025: మరికొద్ది గంటల్లో క్రికెట్ ప్రేమికులను నిజమైన పండుగ మొదలు కాబోతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ మార్చి 22 నుండి ప్రారంభం కానుంది. ఈ ఐపీఎల్ సీజన్ గత సీజన్ల కంటే ఈ సారి అత్యంత ప్రత్యేకమైన సీజన్ కానుంది.ఐపీఎల్ 2025 కి ముందు బీసీసీఐ చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఈ లీగ్ మరింత ఉత్తేజకరంగా సాగబోతుంది. ఈసారి ఐపీఎల్‌లో మొత్తం 3 కొత్త నియమాలు కనిపిస్తాయి. వీటిని ఇప్పటి వరకు ఏ లీగ్ లో ఉపయోగించలేదు. ఇద్దరు ఆటగాళ్ళు మొదటిసారి కెప్టెన్‌గా ఆడుతున్నారు.

ఐపీఎల్ 2025 లో ఆటగాళ్ల సంపాదనలో భారీ పెరుగుదల కనిపించనుంది. ఇప్పటివరకు ఆటగాళ్లకు వేలంలో వేసిన బిడ్ ప్రకారం మాత్రమే డబ్బు వచ్చేది. కానీ ఈసారి ఈ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజు కూడా ఇస్తారు. జట్టు షీట్‌లో చేర్చబడిన 12 మంది ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్‌కు రూ.7.5 లక్షలను బీసీసీఐ ఇవ్వనుంది. అయితే, మ్యాచ్‌లో పాల్గొనని ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులు లభించవు. ఈ నియమం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందే ఆటగాళ్లు వేలంలో రూ.30 లక్షలు లేదా రూ.50 లక్షలకు కొనుగోలు చేయబడిన వారే.

ఇప్పుడు జట్లు ఎత్తు, ఆఫ్ సైడ్ వెడల్పు కోసం డీఆర్ఎస్ ను ఉపయోగించనున్నాయి. ఆఫ్-స్టంప్ వెలుపల వైడ్‌లను, ఎత్తుపై వైడ్‌లను నిర్ణయించడానికి హాక్ ఐ, బాల్ ట్రాకింగ్ ఉపయోగించనున్నారు. ఐపీఎల్ 2024లో ఉపయోగించిన అదే టెక్నాలజీ హెడ్ పై వెడల్పు, ఆఫ్ సైడ్ వెడల్పు విషయంలో కూడా వర్తిస్తుంది.

ఐపీఎల్ 2025 డే-నైట్ మ్యాచ్‌లలో 3 బంతులు ఉపయోగిస్తారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఒక బంతిని ఉపయోగిస్తారు. అయితే, రెండవ ఇన్నింగ్స్‌లో రెండు బంతులను ఉపయోగిస్తారు. మంచు ప్రభావాన్ని తగ్గించడానికి నియమాల ప్రకారం మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్‌లో 11వ ఓవర్ తర్వాత కొత్త బంతిని ఉపయోగిస్తారు. ఇది కాకుండా, బౌలర్లు ఐపీఎల్ 2025లో గ్రిప్ కోసం ఉమ్ము ఉపయోగించవచ్చు. కోవిడ్-19 నుంచి లాలాజల వాడకాన్ని నిషేధించారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 కోసం తమ జట్టుకు రజత్ పాటిదార్‌ను కెప్టెన్‌గా నియమించింది. ఈ లీగ్‌లో రజత్ పాటిదార్ తొలిసారి కెప్టెన్‌గా కనిపించనున్నాడు.రాజస్థాన్ జట్టు మొదటి 3 మ్యాచ్‌లకు జట్టు కమాండ్ బాధ్యతలను ర్యాన్ పరాగ్‌కు అప్పగించింది. అతను ఈ లీగ్‌లో తొలిసారి కెప్టెన్‌గా కూడా కనిపిస్తాడు.

Tags:    

Similar News