IPL 2025: ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లు ఏ బంతితో ఆడతారు? ఒక్కో బాల్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

Which ball is used in IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఐపీఎల్ 2025 మార్చి 22 నుండి ప్రారంభం కాబోతోంది. లీగ్ 18వ సీజన్‌లో అనేక కొత్త నియమాలు కూడా అమలు కాబోతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో, గత 17 సీజన్లలో బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం చెలాయించారు. కానీ ఈ లీగ్‌లో మ్యాచ్‌లు ఆడటానికి ఏ బంతిని ఉపయోగిస్తారో... దాని ధర ఎంతో తెలుసా?
ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లలో ఉపయోగించిన బంతి వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. ఈ బంతి చాలా గట్టిగా ఉంటుంది. ఈ బంతి తగిలి చాలా మంది బ్యాట్స్‌మెన్ బ్యాట్లు విరిగిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు కొన్నిసార్లు బౌండరీ అవతలి గాజు కూడా పగిలిపోయింది. మరి అంత గట్టి బాల్ వెనకున్న హిస్టరీ ఏంటీ? తెలుసుకుందాం.
ఐపీఎల్ మ్యాచ్‌లలో ఉపయోగించే బంతి కూకబుర్రాతో తయారు చేస్తారు. ఈ బాల్ తెలుపు రంగులో ఉంటుంది. ఈ బాల్ ను ఐపీఎల్‌లోనే కాకుండా ఐసీసీ టోర్నమెంట్లలో, ఏదైనా ద్వైపాక్షిక సిరీస్‌లలో కూడా ఉపయోగిస్తారు. ఈ బాల్ ను 1970నుంచి వాడుతున్నారు. కూకబుర్రా బంతి ప్రత్యేకత ఏంటంటే దాని తోలు నాణ్యత. దీని కారణంగా బంతి ఎక్కువ దూరం ప్రయాణించగలదు. ఐపీఎల్‌లో చాలా ఫోర్లు, సిక్సర్లు కొట్టబడటానికి ఇదే కారణం. బంతి సీమ్ లోపల రెండు పొరలను మాత్రమే చేతితో కుట్టారు. బంతిపై మిగతా కుట్లు అన్నీ యంత్రం ద్వారా తయారు అవుతాయి. ఈ IPL 2025 లో కూడా కూకబుర్రా బంతిని ఉపయోగించబోతున్నారు. ఈ బాలో ధర దాదాపు రూ.18000 ఉంటుందట.