BCCI: ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచినందుకు టీమ్‌ఇండియాపై కనక వర్షం కురిపించిన బీసీసీఐ

BCCI: టీం ఇండియా మార్చి 9న న్యూజిలాండ్‌ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు మూడోసారి ఛాంపియన్‌గా నిలిచింది.

Update: 2025-03-20 10:45 GMT
BCCI: ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచినందుకు టీమ్‌ఇండియాపై కనక వర్షం కురిపించిన బీసీసీఐ
  • whatsapp icon

BCCI: టీం ఇండియా మార్చి 9న న్యూజిలాండ్‌ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు మూడోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు బీసీసీఐ జట్టు సభ్యుల మీద కనక వర్షం కురిపించింది. మార్చి 20న టోర్నమెంట్‌లో పాల్గొన్న జట్టు సభ్యులందరికీ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందితో సహా, బోర్డు రూ.58 కోట్ల రివార్డును ప్రకటించింది. టోర్నమెంట్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినందుకు రోహిత్ శర్మతో సహా అందరు ఆటగాళ్లను బీసీసీఐ తన ప్రకటనలో ప్రశంసించింది.

బీసీసీఐ ఏం చెప్పింది?

ఈ రివార్డును ప్రకటిస్తూ బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. అందుటో 'కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో టోర్నమెంట్‌లో భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. భారత జట్టు నాలుగు బలమైన విజయాలతో ఫైనల్‌కు చేరుకుంది. ఆ జట్టు బంగ్లాదేశ్‌పై 6 వికెట్ల విజయంతో తన ప్రస్తానం ప్రారంభించింది. తర్వాత పాకిస్తాన్‌పై అద్భుతమైన విజయాన్ని సాధించింది. న్యూజిలాండ్‌ను 44 పరుగుల తేడాతో ఓడించి విజయాల పరంపర కొనసాగించారు. చివరికి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో ఓడించారు.

2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నందుకు టీమ్ ఇండియాకు రూ. 58 కోట్ల నగదు బహుమతిని ప్రకటించడం పట్ల బీసీసీఐ సంతోషంగా ఉంది' అని బోర్డు తన ప్రకటనలో తెలిపింది. ఆటగాళ్లు, కోచింగ్, సపోర్ట్ సిబ్బంది, సెలక్షన్ కమిటీ సభ్యులను గౌరవించటానికి ఈ రివార్డును ప్రకటిస్తున్నారు. అంటే బహుమతి డబ్బులను వారందరికీ పంచుతారు. ఎవరికి ఎంత డబ్బు ఇస్తారనేది బోర్డు చెప్పలేదు.

'వరుసగా ఐసీసీ టైటిళ్లు గెలవడం చాలా ప్రత్యేకమైనది. ఈ అవార్డు ప్రపంచ వేదికపై టీమ్ ఇండియా గొప్పతనాన్ని గుర్తిస్తుంది' అని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ అన్నారు. ఈ నగదు బహుమతి తెర వెనుక ఉన్న ప్రతి ఒక్కరి కృషికి గుర్తింపు. 2025లో ఐసీసీ అండర్-19 మహిళల ప్రపంచ కప్ విజయం తర్వాత ఇది మా రెండవ ఐసీసీ ట్రోఫీ.

గతేడాది భారత జట్టు 17 సంవత్సరాల తర్వాత T20 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుంది. ఆ సమయంలో కూడా బీసీసీఐ టీం ఇండియా ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి భారీ నగదు బహుమతి అందించింది. రోహిత్ శర్మ కెప్టెన్ గా వహించే జట్టుకు బోర్డు రూ.125 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించింది. ఆ బహుమతిని అందరు ఆటగాళ్ళు, సెలెక్టర్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి పంపిణీ చేశారు.

Tags:    

Similar News