IPL 2020 Updates: ఢిల్లీ తడ బ్యాటు! పంజాబ్ లక్ష్యం 158!

IPL 2020 Updates : ఢిల్లీ జట్టు బ్యాటింగ్ లో తడబడింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే 3 వికెట్లు వరుసగా కోల్పోవడంతో ఆత్మరక్షణలో పడింది. చివరకు స్టోయినిస్ మెరుపు ఇన్నింగ్స్ తో పోరాదగలిగే స్కోరును సాధించింది ఢిల్లీ జట్టు.

Update: 2020-09-20 15:55 GMT

IPL 2020 Match 2 updates (image: hotstar)

ఐపీఎల్ 2020 రెండో మ్యాచ్ లో కింగ్స్ XI పంజాబ్ కి మంచి ఆరంభం లభించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కెఎల్ రాహుల్ నమ్మకాన్ని మొదటి పది ఒవర్లలోనూ బౌలర్లు నిలబెట్టుకున్నారు. వరుసగా మూడు వికెట్లు తీసి ఢిల్లీ జట్టును ఆత్మరక్షణలోకి నెట్టేశారు. దీంతో పరుగులు చేయడమే కష్టంగా మారింది ఢిల్లీ బ్యాట్స్ మెన్ కి. ఇన్నింగ్స్ రెండో ఒవర్లోనె ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ రనౌట్ గా వెనుతిరిగాడు. తరువాత మూడో ఓవర్లో మహమ్మద్ షమీ ఒక్కసారిగా పదునైన బంతులతో విరుచుకు పడ్డారు. దీంతో ఆ ఓవర్ మూడో బంతికి పృధ్వీ షా అవుట్ అయ్యాడు. తరువాత హెట్ మేయర్ నాలుగో బంతికి తన వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్..తన సహచరుడు పంత్ తో కలసి ఇన్నింగ్స్ దారిలో పెట్టె ప్రయత్నం చేశాడు. అయితే, పంజాబ్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్..ఫీల్డింగ్ లతో పరుగులు రావడం కష్టంగా మారింది. దీంతో పది ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ జట్టు మూడు వికెట్లను కోల్పోయి 43 పరుగులు చేసింది. 

పదో ఓవర్ తరువాత ఢిల్లీ  జోరు పెంచింది. గౌతమ్ బౌలింగ్లో వరుసగా రెండు సిక్స్ లు బాది శ్రేయాస్ గేర్ పెంచాడు. ఈ సమయంలో బిష్ణోయ్ బౌలింగ్ లో పంత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ మహ్మద్ షమీని రెండో స్పెల్ బౌలింగ్ కి తీసుకువచ్చాడు. వస్తూనే ఊపు మీద ఉన్న శ్రేయాస్ అయ్యర్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు షమీ. వరుసగా రెండు కీలక వికెట్లు కోల్పోయిన ఢిల్లీ మళ్ళీ ఆత్మరక్షణలో పడిపోయింది.  ఇక అందరూ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటే.. చివర్లో స్టోయినిస్ తన మెరుపులతో ఒక మోస్తరు స్కోరు చేయగలిగింది ఢిల్లీ. కేవలం 20 బంతులలో తన అర్ధసెంచరీ చేశాడు. 

చివరకు 20 ఓవర్లలో ఢిల్లీ జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి 157  పరుగులు చేసింది.  స్టోయినిస్ చివర్లో చెలరేగడం తో ఢిల్లీ పోరాటం చేయగలిగే స్కోరు సాధించింది. 

ఢిల్లీ  క్యాపిట‌ల్స్‌ స్కోర్ కార్డు :

పృథ్వీ షా 5 (9) శిఖర్ ధావన్ రనౌట్ 0 (2) షిమ్రాన్ హెట్మియర్ 7 (13) శ్రేయాస్ అయ్యర్ 39( 32) రిషబ్ పంత్ 31 (29) మార్కస్ రనౌట్ 53( 21) ఆక్సర్ పటేల్ 6 (9) రవిచంద్రన్ అశ్విన్ 4 (6) కగిసో రబాడా నాటౌట్ 0 (0) అన్రిచ్ నార్ట్జే నాకౌట్ 3 (1)


Tags:    

Similar News