IPL 2020 Match 16 Updates : సిక్సర్ల జోరు..హోరా హోరీ పోరు..ఢిల్లీ జయభేరి!
IPL 2020 Match 16 Updates : సిక్సర్ల జోరు నడిచిన ఢిల్లీ..కోల్ కతా మ్యాచ్ లో ఢిల్లీ ఘన విజయం సాధించింది.
IPL 2020 Match 16 Updates | ఆడిన మూడు మ్యాచుల్లో రెండేసి మ్యాచ్ లు గెలిచి సమ ఉజ్జీలుగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. కోల్ కతా నైట్ రైడర్స్ టోర్నమెంట్ 16 వ మ్యాచ్లో నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. చివరి వరకూ తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా జట్టుకు ఢిల్లీ బ్యాట్స్ మెన్ చుక్కలు చూపించారు. సిక్స్ లు ఫోర్లతో విరుచుకు పడి భారీ స్కోరు సాధించారు. దాంతో భారీ లక్ష్యాన్ని చేధించడానికి బరిలో దిగిన ఢిల్లీ ఆటగాళ్ళు ధాటిగా ఆడినా..వికెట్లు కోల్పోతూ రావడంతో ఒక దశలో విజయానికి దరిదాపుల్లోకి కూడా రారని అనిపించింది. కానీ, చివరి ఐదు ఓవర్లలో మ్యాచ్ రసవత్తరంగా మారిపోయింది. మోర్గాన్ విరుచుకుపడి వరుస సిక్స్ లు ఫోర్లతో హోరేట్టించాడు. అతనికి రాహుల్ త్రిపాఠి తోడవడంతో కోల్ కతా ఒక్కసారిగా గాడిలో పడినట్టయింది. కానీ, మోర్గాన్ అవుట్ అవడంతో కథ మారిపోయింది. తరువాత త్రిపాఠి ధాటిగా ఆడినా చివర్లో అవుట్ అవడం.. అప్పటికి కావాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో కోల్ కతా ఓటమి పాలవ్వక తప్పలేదు.
కోల్ కతా బ్యాటింగ్ సాగిందిలా..
* 229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతాకు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే ఓపెనర్ సరైన్ మూడు పరుగులు చేసి నోర్జే బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రెండు ఒవర్లకి 8 పరుగులు చేసింది కోల్ కతా.
* అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రాణా చెలరేగాడు. డీప్ స్వ్కేర్ లెగ్, లాంగ్ ఆన్ మీదగా రెండు సిక్సర్లు బాదాడు. దీంతో 3 ఓవర్లకు కోల్‌కతా 27/1
* నోర్జె బౌలింగ్‌లో నాలుగో ఓవర్లో గిల్ ఫోర్, సిక్సర్ సాధించాడు. దీంతో 4 ఓవర్లకు కోల్‌కతా 39/1
* జాగ్రత్తగా..ఒకింత దూకుడుగా ఆడుతున్న రాణా..గిల్ జోడీని అమిత్ మిశ్రా విడదీశాడు. ఇన్నింగ్స్ 9 వ ఓవర్ తొలిబంతికి గిల్ అవుటయ్యాడు. దీంతో 9 ఓవర్లకు 84/2 పరుగులు చేసింది కోల్ కతా.
* 10 వ ఓవర్లో మరో దెబ్బ తగిలింది కోల్ కతా కు.. రబాడ వేసిన పదో ఓవర్‌లో ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టి దూకుడు మీద కనిపించిన ఆండ్రూరసెల్(13) చివరి బంతికి ఔటయ్యాడు. దీంతో కోల్‌కతా 10 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది.
* స్టోయినిస్ వేసిన 12వ ఓవర్‌లో నితీశ్ రాణా అర్ధశతకం సాధించాడు. దీంతో కోల్‌కతా 12 ఓవర్లకు 108/3తో నిలిచింది.
* హర్షల్ పటేల్ వేసిన 13వ ఓవర్‌లో కోల్‌కతాకు పెద్ద దెబ్బ తగిలింది. ఈ ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత మూడో బంతికి భారీ సిక్స్ కొట్టిన నితీశ్ రాణా(58) తర్వాతి బంతికే ఔటయ్యాడు. తర్వాతి బంతికే దినేశ్ కార్తీక్(6) సైతం ఔటయ్యాడు. దీంతో 13 ఓవర్లకు కోల్‌కతా 118/5తో నిలిచింది.
* నోర్జే వేసిన 14వ ఓవర్ మూడో బంతికి పాట్ కమిన్స్(5) ఔటయ్యాడు. దీంతో కోల్‌కతా 122 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ఇప్పుడు త్రిపాఠి క్రీజులోకి వచ్చాడు. ఇక్కడ నుంచి పరుగుఅల్ వర్షం కురవడం ప్రారంభం అయింది. 14 ఓవర్లకు కోల్ కతా స్కోరు ఆరు వికెట్లకు 131.
* 17 వ ఓవర్లో రాహుల్ త్రిపాఠి రెచ్చిపోయాడు. మూడు సిక్స్ లు ఒక బౌండరీ బాదేశాడు. దీంతో ఆ ఓవర్ పూర్తయ్యే సరికి కోల్ కతా 6 వికెట్లకు175 పరుగులు చేసింది.
* రాబడా వేసిన 18 వ ఓవర్లో మోర్గాన్ మూడు సిక్స్ లు వరుసగా బాదేశాడు. తరువాత త్రిపాఠి ఓ బౌండరీ కొట్టాడు. దీంతో 18 ఓవర్లకు కోల్ కతా 198/6 పరుగులు చేసింది.
* 19 వ ఓవర్లో మూడో బంతికి ఇయాన్ మోర్గాన్(44) ఔటయ్యాడు. కీలక సమయంలో అతడు భారీ షాట్ ఆడి బౌండరీ లైన్ వద్ద షిమ్రన్ హెట్‌మైయిర్ చేతికి చిక్కాడు. దీంతో కోల్‌కతా 200 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. 19 ఓవర్లకు ఆ జట్టు స్కోర్ 203/7గా నమోదైంది.
* 20 ఓవర్లో త్రిపాఠి రెండో బంతికి అవుట్ అయ్యాడు. దీంతో కోల్ కతా కథ ముగిసిపోయింది. దిల్లీ 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
అంతకు ముందు టాస్ ఒడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 229 పరుగుల భారీ టార్గెట్‌ను కోల్ కతా నైట్ రైడర్స్ కు నిర్దేశించింది. పృథ్వీ షా(66; 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్(88 నాటౌట్; 38 బంతుల్లో 7ఫోర్లు, 6 సిక్స్‌లు), రిషభ్ పంత్( 38 ; 17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది.