IPL 2020 Match 7 Updates: ఢిల్లీని కట్టడి చేసిన బౌలర్లు.. చెన్నై విజయలక్ష్యం 176!

IPL 2020 Match 7 Updates : కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఢిల్లీ ని భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు చెన్నై బౌలర్లు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 175 పరుగులు చేసింది.

Update: 2020-09-25 15:51 GMT

టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ధోనీ నిర్ణయం తప్పేమో అని అనిపించింది మొదట్లో.. ఢిల్లీ ఓపెనర్లు పృధ్వీ షా.. శిఖర్ ధావన్ ఆచి తూచి ఆటను మొదలెట్టారు. తరువాత గేర్లు మార్చారు.. ఒకవైపు శిఖర్ ధావన్ స్పీడు పెంచితే, పుద్వీ జాగ్రత్తగా ఆడాడు. ఈ క్రమంలో పృధ్వీ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తరువాత కొద్ది సేపటికే శిఖర్ ధావన్ అవుటయ్యాడు. తరువాతి ఓవర్లోనే పృధ్వీ కూడా ఔటయ్యాడు. దీంతో క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్.. పంత్ అనుకున్నంత వేగంగా పరుగులు చేయలేకపోయారు. ఓవర్లు గడిచే కొద్దీ చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ ఢిల్లీ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. 18 వ ఓవర్లో శాం కురేన్ శ్రేయాస్ అయ్యర్ ను అవుట్ చేశాడు. దీంతో ఢిల్లీ జట్టు మొత్తమ్మీద మూడు వికెట్లకు 175 పరుగులు చేసి చెన్నైకి 176 పరుగుల లక్ష్యాన్నిచ్చింది.

ఢిల్లీ బ్యాటింగ్ సాగిందిలా..

* మెల్లగా మొదలైన బ్యాటింగ్ సామ్‌కరన్‌ వేసిన నాలుగో ఓవర్‌లో పృథ్వీ షా(22) రెండు బౌండరీలు బాదడంతో పాటు మరో మూడు పరుగులు తీశాడు. అలాగే ఒక వైడ్‌ పపడంతో ఈ ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి. 4 ఓవర్లకు దిల్లీ స్కోర్‌ 27/0

* పృథ్వీషా రెండు బౌండరీలు బాదడంతో పీయూష్‌ చావ్లా వేసిన 7వ ఓవర్‌లో మొత్తం 13 పరుగులు వచ్చాయి. దీంతో ఈ ఓవర్‌ పూర్తయ్యేసరికి దిల్లీ స్కోర్‌ 49/0కి చేరింది.

* రవీంద్ర జడేజా వేసిన 8వ ఓవర్‌లో శిఖర్‌ ధావన్‌(21) రెచ్చిపోయాడు. తొలి బంతినే సిక్స్‌ కొట్టిన అతడు నాలుగో బంతిని బౌండరీ తరలించాడు. అలాగే ఈ ఓవర్‌లో మరో మూడు పరుగులు వచ్చాయి. దీంతో 8 ఓవర్లకు దిల్లీ స్కోర్‌ 62/0గా నమోదైంది.

* చావ్లా వేసిన 9వ ఓవర్‌లో పృథ్వీషా(49) రెండు బౌండరీలు బాదాడు. అలాగే మూడు సింగిల్స్‌ వచ్చాయి. దీంతో 9 ఓవర్లకు ఆ జట్టు స్కోర్‌73/0గా నమోదైంది. మరోవైపు ధావన్‌(22) ఆచితూచి ఆడుతున్నాడు.

* జడేజా వేసిన పదో ఓవర్‌లో మొత్తం 15 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌లో ధావన్(30) ఒక బౌండరీ కొట్టగా, చివరి బంతికి పృథ్వీ (56) సిక్సర్‌ కొట్టాడు. అలాగే మరో 5 పరుగులు వచ్చాయి. దీంతో 10 ఓవర్లకు దిల్లీ స్కోర్‌ 88/0గా నమోదైంది.

* 11 వ ఓవర్లో చెన్నెకి తొలి వికెట్‌ దక్కింది. గబ్బర్‌ను (35) చావ్లా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 94 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది.

* చావ్లా బౌలింగ్‌లో పరుగుకు ప్రయత్నించిన పృథ్వీ షా (64)ను ధోనీ స్టంపౌట్‌ చేశాడు. 13 ఓవర్లకు దిల్లీ 105/2.

* చాహర్‌ బౌలింగ్‌లో పంత్ (15) అద్భుతమైన కవర్‌డ్రైవ్‌తో బౌండరీ బాదాడు. ఈ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లకు దిల్లీ 124/2

* సామ్‌కరన్‌ వేసిన 16వ ఓవర్‌లో దిల్లీ 10 పరుగులు రాబట్టింది. తొలి బంతికి పంత్‌(21) బౌండరీ బాదగా, మరో ఆరు పరుగులు వచ్చాయి. దీంతో 16 ఓవర్లకు ఆ జట్టు స్కోర్‌ 134/2కి చేరింది.

* చాహర్‌ వేసిన 17వ ఓవర్‌లో మొత్తం 12 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌లో శ్రేయస్(22)‌ ఒక బౌండరీ బాదడంతో పాటు మూడు డబుల్స్‌, రెండు సింగిల్స్‌ వచ్చాయి. దీంతో 17 ఓవర్లకు ఆ జట్టు స్కోర్‌ 146/2 కి చేరింది.

* హాజిల్‌వుడ్‌ వేసిన 18వ ఓవర్‌లో దిల్లీ 11 పరుగులు సాధించింది. ఈ ఓవర్‌లో పంత్‌(31) రెండు ఫోర్లు కొట్టాడు. దీంతో 18 ఓవర్లకు దిల్లీ స్కోర్‌ 157/2గా నమోదైంది.

* సామ్‌కరన్‌ వేసిన 19వ ఓవర్‌ చివరి బంతికి శ్రేయస్‌అయ్యర్‌(26) ఆడిన షాట్‌ను ధోనీ అమాంతం కుడివైపునకు గాల్లోకి ఎగిరి క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో దిల్లీ మూడో వికెట్‌ కోల్పోయింది. జట్టు స్కోర్‌ 161/3కి చేరింది.

* 20 ఓవర్లో హేజల్ వుడ్ 14 పరుగులు ఇచ్చాడు. దీంతో ఢిల్లీ జట్టు చెన్నై ముందు 176 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. 

ఐపీఎల్ క్రికెట్ లైవ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Tags:    

Similar News