ICC World Cup: ఐసీసీ కొత్త నిర్ణయం..క్రికెట్ లవర్స్ కు ఇక పండగే
ICC World Cup: క్రికెట్ అభిమానులకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) గుబ్ న్యూస్ చెప్పింది.
ICC World Cup: క్రికెట్ అభిమానులకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) గుబ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే టీ20 కప్ రెండళ్లకొసారి నిర్వహించాలని నిర్ణయింది. ఇప్పటి వరకు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఏప్పుడు జరుగుతుందో కూడా తేలియదు. ఓ పద్దతి లేకుండా జరుగుతన్న ఈ టోర్నీని సక్రమంగా నిర్వహించేలా చర్య తీసుకుంది. ఇక ఇదే సమయంలో టీ20ల్లో పాల్గొనే జట్ల సంఖ్యను కూడా పెంచాలని ఐసీసీ నిర్ణయం తీసుకంది. ఇప్పటివరకు 8.. 10 జట్లతో నిర్వహించిన వన్డే ప్రపంచ కప్ టోర్నీలో రానున్న రోజుల్లో 14 జట్లతో నిర్వహించనున్నారు. 2027 ప్రపంచ కప్ నుంచి ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తేనున్నారు.
ఈ సందర్భంగా ఏనిమిదేళ్ల కేలెండర్ కూడా ప్రకటించింది. రానున్న ఎనిమిదేళ్లకు సంబంధించిన క్రికెట్ పోటీల వివరాలు వెల్లడించింది. రానున్నరోజుల్లో పురుషులు ప్రపంచ కప్ టోర్నీతో పాటు.. టీ20 ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనే జట్ల సంఖ్యను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. పురుషుల టీ 20 ప్రపంచ కప్ టోర్నీని ఏకంగా 20 జట్లతో నిర్వహిస్తామని.. ప్రతి టోర్నీలోనూ 55 మ్యాచులు ఉండనున్నాయి. ఇప్పటివరకు 16జట్లతో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు.
కాగా.. టీ20 వర్డల్ కప్ ను 2024.. 2026.. 2028.. 2030లలో జరుగుతాయని.. ఒక్కో టోర్నీలో 55 మ్యాచులు ఉండనున్నాయి.రానున్న రోజుల్లో వన్డే ప్రపంచ కప్ ను 2027.. 2031లో నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో మొత్తం 14 జట్లు పాల్గొనటంతో పాటు.. మొత్తం 54 మ్యాచుల్ని నిర్వహిస్తారు. టీ 20.. వన్డే ప్రపంచ కప్ లు రెండింటిలోనూ జట్లు పెరగటంతో పాటు.. ఛాంపియన్ ట్రోఫిని మళ్లీ ప్రవేశ పెట్టున్నట్లుగా చెప్పింది. పురుషుల టీ20 ప్రపంచ కప్ లోనే కాదు.. మహిళల ప్రపంచ కప్ లోనూ జట్ల సంఖ్యను పెంచనున్నారు. రాబోయే రోజుల్లో ఐపీఎల్, సీపీఎల్, ఇలాంటి క్యాఫ్ రిచ్ లీగ్ లే కాకుండా..అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలు ఎక్కవ ఉండటంతో క్రికెట్ లవర్స్ కి పెద్దపండగే. మరోవైపు జట్ల సంఖ్య ,మ్యాచుల సంఖ్య పెంచడంతో చిన్న జట్లకు కప్ గెలుచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.