Pele: సాకర్ దిగ్గజం పీలే కన్నుమూత
Pele: క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచిన పీలే
Pele: బ్రెజిల్ దిగ్గజం, ఫుట్‌బాల్ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకరైన పీలే కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న పీలే.. సావోపాలో లోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బ్రెజిల్‌కు చెందిన పీలే వయసు 82 ఏళ్లు. గతేడాది సెప్టెంబర్‌లో వైద్యులు పెద్ద పేగులో క్యాన్సర్ కణితిని తొలగించారు. అప్పటి నుంచి ఆయనకు కీమోథెరపీ చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో అవయవాలు పనిచేయపోవడంతో పీలే కన్నుమూశారు. ఫుట్‌బాల్‌లో మూడు ప్రపంచకప్ విజయాల్లో భాగస్వామి అయిన ఏకైక ఆటగాడు పీలేనే. మంత్రముగ్ధమైన తన ఆటతో రెండు దశాబ్దాల పాటు సాకర్ ప్రేమికులను ఉర్రూతలూగించిన పీలే.. తన తరంలోనే కాక మొత్తంగా ఫుట్‌బాల్ చిరిత్రలోనే అత్యత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. 1958, 1962, 1970 ప్రపంచకప్‌లు అందుకున్నారు పీలే.