Corona Virus: బీసీసీఐ అనూహ్య నిర్ణయం.. టోర్నీ రద్దు

Corona Virus: దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లి పెరగడంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు( బీసీసీఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది.

Update: 2021-03-17 04:28 GMT

బీసీసీఐ(ఫైఫొటో)

Corona Virus: దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లి పెరగడంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు( బీసీసీఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. వినూ మాన్కడ్‌ ట్రోపీ సహా అన్ని విభాగాల క్రికెట్‌ టోర్నమెంట్లను రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ స్పష‌్టం చేసింది. ఈ మేరకు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా వెల్లడించారు. త్వరలో జరబోయే అన్ని టోర్నీలు రద్దు చేయాలని అన్ని రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ ఉదృతి కారణంగా అన్ని బోర్డులకు రాష్ట్రాల బోర్డులకు సమాచారం అందించారు.

మరోవైపు టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సీరీస్ విషయంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత, ఇంగ్లండ్‌ ఇప్పటికే మూడు టీ20లు ముగియడంతో.. చివరి రెండు టీ20లకు ప్రేక్షకులను అనుమతి ఇవ్వకుడదని నిర్ణయించింది. ఐదు టీ20లు అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటి రెండు టీ20లకు 50 శాతం ప్రేక్షకులను అనుమతించిన బీసీసీఐ.. మిగతా మూడూ టీ20లతో పాటు రానున్న వన్డే సిరీస్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనుంది. ఇప్పటికే మంగళవారం జరిగిన మూడో టీ20లో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ జరిగిందని.. మిగతా మ్యాచ్‌లు అలాగే నిర్వహిస్తామని గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ తెలిపింది.

ఇక ఈ ఏడాది ఏప్రిల్ లో జరగనున్న ఐపీఎల్ 2021 సీజన్ 14పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. ఏప్రిల్ లోగా కరోనా ఉదృతి కోనసాగితే ఐపీఎల్ కూడా ప్రేక్షకులు లేకుండా నిర్వహించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాకుంటే ఇతర దేశంలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీ భావిస్తోందని సమాచారం. గత ఏడాది ఐపీఎల్-13 బయోబుడగ నీడలో యూఏఈలో నిర్వహించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News