Viral video: స్టేజ్‌పైనే పొట్టు పొట్టు కొట్టుకున్న కొత్త జంట.. వైరల్‌ అవుతోన్న వీడియో..

Viral video: స్టేజ్‌పైనే ఒకరిని ఒకరు దారుణంగా కొట్టుకున్నారు. మరి వివాహాని ముందే గొడవలు ఉన్నాయో లేదా అక్కడే ఏం జరిగిందో తెలియదు కానీ.. దండలు మార్చుకున్న తర్వాత ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

Update: 2024-11-30 13:00 GMT

Viral video: స్టేజ్‌పైనే పొట్టు పొట్టు కొట్టుకున్న కొత్త జంట.. వైరల్‌ అవుతోన్న వీడియో..

Viral video: కొత్తగా పెళ్లైన జంట ఎంత అన్యోన్యంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివాహం జరిగి ఏళ్లు గడిచిన తర్వాత ఏవైనా గొడవలు జరిగితే జరుగుతుండొచ్చు కానీ.. పెళ్లైన కొత్తలో మాత్రం ఎంతో ప్రేమతో ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా వివాహ వేడుకలో ఫొటోలకు పోజులిస్తూ సరదాగా గడుపుతుంటారు. అయితే ఓ కొత్త జంట మాత్రం విచిత్రంగా ప్రవర్తించింది.

స్టేజ్‌పైనే ఒకరిని ఒకరు దారుణంగా కొట్టుకున్నారు. మరి వివాహాని ముందే గొడవలు ఉన్నాయో లేదా అక్కడే ఏం జరిగిందో తెలియదు కానీ.. దండలు మార్చుకున్న తర్వాత ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఎడాపెడ చెంపలపై వాయించుకున్నారు. ఇది చూసిన అతిథులంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఇద్దరినీ కంట్రోల్‌ చేయడానికి ఎంతగానో ప్రయత్నించారు. అయినా ఎవరి మాట వినకుండా కొట్టుకుంటూనే ఉన్నారు.

దీనిని అక్కడే ఉన్న వారు కెమెరాలో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. పెళ్లి రోజే వీరి ఇలా ఉంటే ఇంకొన్ని రోజులు గడిస్తే పరిస్థితి ఏంటో అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఈ వీడియోపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది సహజంగా జరిగింది కాదని, స్క్రిప్ట్‌ ప్రకారమే అయ్యుంటుందని భావిస్తున్నారు.

ఇద్దరు కొట్టుకునే సమయంలో వారు నవ్వుతుండడం గమనించవచ్చు. అలాగే పక్కనున్న వారు కూడా నవ్వుతుండడం ఏదో అనుమానంగా ఉందంటూ స్పందిస్తున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యేందుకు కావాలనే ఇలాంటి వీడియోలు తీస్తూ పోస్ట్‌ చేస్తున్నారు. మరి ఈ వీడియోలో ఎంత వరకు నిజం ఉందో పోస్ట్‌ చేసిన వారికే తెలియాలి.



Tags:    

Similar News