Viral Video: ఐస్‌క్రీంను నాకి ప్యాకింగ్ చేస్తున్న సిబ్బంది.. కంపెనీ సీజ్
Viral Video: ఇటీవల బయటి ఫుడ్ జనాలను కలవరపెడుతోంది. బయట ఏదైనా తినాలంటేనే జనం వణికిపోతున్నారు.
ఇటీవల బయటి ఫుడ్ జనాలను కలవరపెడుతోంది. బయట ఏదైనా తినాలంటేనే జనం వణికిపోతున్నారు. బిర్యానీలో బల్లి, ఐస్‌క్రీంలో తెగిన మనిషి వేలు, జెర్రీ దర్శనమివ్వడంతో భయపడిపోతున్నారు. గత కొద్ది రోజులుగా కలుషిత ఆహార పదార్థాలకు సంబంధించిన వరుస సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. ఈసారి అలాంటివి ఏమీ కావు.. ఐస్‌క్రీంలను షాపులకు పంపడానికి ముందు వాటిని నాకి రుచి చూసి ప్యాక్ చేస్తున్నారు సిబ్బంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియో చూసిన వారు ఇదేం పని అంటూ మండిపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కంపెనీని సీజ్ చేశారు. ఈ ఘటన కేరళలోని కొయికోడ్‌లో చోటుచేసుకుంది.
కొయికోడ్‌లో ఐస్ మీ అనే ఐస్ క్రీం కంపెనీ ఉంది. ఐస్ క్రీం కొనుగోలు చేసేందుకు కంపెనీకి వెళ్లిన ఓ కస్టమర్ ఐసులు నాకి ప్యాక్ చేస్తున్న సిబ్బందిని చూసి గుట్టుచప్పుడు కాకుండా వీడియో తీశాడు. వీడియో వైరల్ కావడంతో కంపెనీకి వెళ్లిన ప్రజలు.. సిబ్బంది రషీద్‌ను పట్టుకుని కొడువల్లి పోలీసులకు అప్పగించారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. కంపెనీని సీజ్ చేశారు. శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు తరలించారు.