Viral: ప్రాణాల మీదికి తెచ్చిన సెల్ఫీ పిచ్చి.. ఆసుపత్రిలో 29 ఏళ్ల యువతి..!
Viral: ప్రస్తుతం యువతలో సెల్ఫీ పిచ్చి పెరిగిపోతోంది. సెల్ఫీలు దిగాలి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి.
Viral: ప్రస్తుతం యువతలో సెల్ఫీ పిచ్చి పెరిగిపోతోంది. సెల్ఫీలు దిగాలి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. వాటికి వచ్చే లైక్స్‌ను కామెంట్స్‌ను చూసి సంబరపడాలి. ఇందు కోసం కొందరు ఎంత దూరమైనా వెళ్తున్నారు. చివరికి ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. రీల్స్ మోజులో పడి ప్రాణాల మీదికి తెచ్చుకున్న సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
వివరాల్లోవి వెళితే.. మహారాష్ట్రాలోని బోరనే ఘాట్‌ను సందర్శించేందుకు ఓ 29 ఏళ్ల నస్రీన్ అమీర్ ఖురేషీ అనె యువతి వెళ్లింది. అదే సమయంలో ఘాట్‌లో సెల్ఫీల తీసుకునేందుకు ప్రయత్నించగా లోతైన లోయలో పడిపోయింది. అప్పటికే అక్కడ భారీ వర్షం కురుస్తుండడంతో యువతి లోయలోకి జారి పోయింది. దీంతో ఇది గమనించిన స్థానికులు, హోంగార్డులు యువతిని రక్షించారు. తాళ్ల సహాయంతో పైకి తీసుకొచ్చారు.
60 అడుగుల లోతులో పడిపోవడంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆమెను సతారాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సతారా జిల్లాలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి అధికారులు ఆగస్టు 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు పర్యాటక ప్రదేశాలను, జలపాతాలను మూసేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ జితేంద్ర దూడి ఆదేశాలు జారీ చేశారు. అయితే కొందరు మాత్రం ఆదేశాలను లెక్కచేయంకుడా పర్యాటక ప్రదేశాలకు వెళ్తూ ఇలా ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెల్ఫీల కోసం ఇలా ప్రాణాల మీదికి తెచ్చుకోవడం అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.