Indian Railway: రైల్వే ప్రయాణికులకి గమనిక.. ఈ ఉచిత సేవల గురించి తెలుసా..?

Indian Railway: భారతీయ రైల్వే దేశానికి లైఫ్‌ లైన్‌ లాంటిది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద నెట్‌వర్క్.

Update: 2022-08-01 09:45 GMT

Indian Railway: రైల్వే ప్రయాణికులకి గమనిక.. ఈ ఉచిత సేవల గురించి తెలుసా..?

Indian Railway: భారతీయ రైల్వే దేశానికి లైఫ్‌ లైన్‌ లాంటిది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద నెట్‌వర్క్. ఇది దేశవ్యాప్తంగా 1.2 లక్షల కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కాశ్మీర్ అయినా కన్యాకుమారి అయినా ప్రజలు తమ గమ్యాన్ని చేరుకోవడానికి రైల్వేలో ప్రయాణించడానికి ఇష్టపడతారు. అయితే రైల్వే కొన్ని ఉచిత సేవలని కూడా ప్రవేశపెట్టింది. వీటి గురించి చాలామందికి తెలియదు. అలాంటి సేవల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

టిక్కెట్ల బుకింగ్ సమయంలో రైల్వే ప్రయాణికులకు క్లాస్ అప్‌గ్రేడేషన్ సౌకర్యాన్ని అందిస్తుంది. అంటే స్లీపర్‌ క్లాసులోని ప్రయాణీకుడు థర్డ్ ఏసీని పొందవచ్చు. థర్డ్ ఏసీ ప్యాసింజర్ సెకండ్ ఏసీని పొందవచ్చు. సెకండ్ ఏసీ ప్యాసింజర్ అదే ఛార్జీతో ఫస్ట్‌ ఏసీ సౌకర్యాన్ని పొందవచ్చు. ఈ సదుపాయాన్ని పొందడానికి ప్రయాణీకులు టికెట్ బుకింగ్ సమయంలో ఆటో అప్‌గ్రేడ్ ఎంపికపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత లభ్యతను బట్టి రైల్వే టిక్కెట్‌ను అప్‌గ్రేడ్ చేస్తుంది.

అదేవిధంగా వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకి మరొక రైలులో సీట్లు కేటాయించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇందుకోసం రైల్వే వికల్ప్ సర్వీసును ప్రారంభించింది. కన్ఫర్మ్ టికెట్ పొందలేని ప్రయాణికులు వేరే రైలులో సీటు పొందేందుకు ఈ ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. ఇందుకోసం టికెట్ బుకింగ్ సమయంలోనే 'ఆప్షన్' ఎంచుకోవాలి. ఆ తర్వాత రైల్వే ఈ సౌకర్యాన్ని కల్పిస్తుంది.

రైల్వే టిక్కెట్లను బదిలీ చేయడానికి అవకాశం కల్పిస్తోంది. ఒక వ్యక్తి ఏ కారణం చేతనైనా ప్రయాణం చేయలేకపోతే అతను తన కుటుంబంలోని ఎవరికైనా టిక్కెట్‌ను బదిలీ చేయవచ్చు. అయితే ప్రయాణ రోజు నుంచి 24 గంటల ముందు టికెట్ బదిలీ చేసుకోవచ్చు. దీని కింద కేవలం తల్లి, తండ్రి, చెల్లి, కొడుకు, కూతురు, భర్త, భార్య పేరు మీద మాత్రమే టిక్కెట్లను బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. దీని కోసం టిక్కెట్ ప్రింట్ తీసుకొని మీరు సమీపంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లాలి. టికెట్ హోల్డర్ ID రుజువు ద్వారా టిక్కెట్‌ని బదిలీ చేసుకోవచ్చు. అయితే టిక్కెట్లను ఒక్కసారి మాత్రమే బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది.

టికెట్ బదిలీ మాదిరిగానే బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే సౌకర్యం కూడా 24 గంటల ముందుగానే అందుబాటులో ఉంటుంది. అంటే ఒక ప్రయాణీకుడు ఢిల్లీ నుంచి టిక్కెట్‌ను బుక్ చేసి ఆ రైలు మార్గంలో మరేదైనా స్టేషన్ నుంచి ఎక్కాలనుకుంటే అతను తన స్టేషన్‌ని మార్చుకోవచ్చు. బోర్డింగ్ స్టేషన్‌లో మార్పు ఆన్‌లైన్‌లో చేయవచ్చు. IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత బుక్ చేసిన టికెట్ హిస్టరీకి వెళ్లడం ద్వారా మీరు బోర్డింగ్ స్టేషన్‌ని మార్చవచ్చు. అయితే మార్చుకునే సదుపాయం ఒక్కసారి మాత్రమే అందుబాటులో ఉంటుందని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News