'సుకన్య సమృద్ధి యోజన' మీ కూతురి విద్యకు అయ్యే ఖర్చుని భరిస్తుందా..!
*ఈ పాలసీకి ప్రీమియం చెల్లింపుపై సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది.
Sukanya Samriddhi Yojana Benefits: కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల కోసం 'సుకన్య సమృద్ధి యోజన' అనే స్కీమ్‌ని ప్రవేశపెట్టింది. ఇందులో పొదుపు చేసే మొత్తంపై అధిక వడ్డీ చెల్లిస్తుంది. ప్రస్తుతం 7.6 శాతం వడ్డీని చెల్లిస్తోంది.
అయితే ఈ స్కీమ్ గురించి ప్రజలలో చాలా అపోహలు ఉన్నాయి. అందులో ఒకటి 'సుకన్య సమృద్ధి యోజన' ఆడపిల్లల చదువుకి ఉపయోగపడుతుందా లేదా కేవలం పెళ్లి కోసం మాత్రమే ఇందులో పొదుపు చేయాలా అనే ప్రశ్న వినిపిస్తోంది. దీని గురించి అసలు విషయాలు తెలుసుకుందాం.
అయితే ఈ ప్రశ్నకి సమాధానం ఆ స్కీమ్‌లో పొదుపు చేసే మొత్తంపై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. ఉదాహారణకు మీ కుమార్తె 3 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు సుకన్య సమృద్ధి ఖాతాను ప్రారంభించారు. ఆ ఖాతాలో ఏటా గరిష్టంగా రూ.1.5 లక్షలు జమ చేస్తున్నారు. 15 ఏళ్లపాటు నిరంతరాయంగా డబ్బు జమ చేశారు.
ఈ విధంగా, 7.6 శాతం వడ్డీ రేటుతో ఖాతా మెచ్యూరిటీపై 43.49 లక్షల రూపాయలు వస్తాయి. అయితే ఈ మొత్తం కూతురి చదువుకు సరిపోతుందని భావించవచ్చు. కానీ మీరు విదేశాలలో చదివించాలనుకుంటే ఈ మొత్తం తక్కువని చెప్పవచ్చు. అటువంటి పరిస్థితిలో మరొక పథకాన్ని ప్రారంభించవలసి ఉంటుంది.
మీరు కావాలంటే ప్రత్యామ్నాయంగా LIC కన్యాదాన్ పాలసీని కూడా తీసుకోవచ్చు. ఈ పాలసీ తక్కువ ఆదాయం కలిగిన వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిలో స్థిర ఆదాయంతో పాటు మూలధన భద్రతకు పూర్తి హామీ ఉంటుంది.
ఇందులో ప్రతిరోజూ రూ.125 డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయానికి రూ.27 లక్షలు వస్తాయి. ఈ పాలసీలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ప్లాన్ 25 సంవత్సరాలు ఉంటుంది. కానీ మీరు 22 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించాలి.
సుకన్య సమృద్ధి యోజన విషయంలోనూ కూడా ఇదే పరిస్థితి. 21 ఏళ్ల పాలసీకి 18 ఏళ్లు మాత్రమే ప్రీమియం చెల్లించాలి. ఈ పాలసీకి ప్రీమియం చెల్లింపుపై సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది.