నాగాలాండ్ ప్రభుత్వం 30 మంది సైనికులపై ఎందుకు కేసు పెట్టింది?

నాగాలాండ్ మోన్ జిల్లాలో ఓటింగ్, తిరు గ్రామాల మధ్య 2021లో జరిగిన కాల్పుల్లో 13 మంది మరణించారు. ఇందులో 13 మంది పౌరులు.

Update: 2024-07-16 15:00 GMT

నాగాలాండ్ ప్రభుత్వం 30 మంది సైనికులపై ఎందుకు కేసు పెట్టింది?

నాగాలాండ్ ప్రభుత్వం 30 మంది భారత జవాన్లపై వేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. 2021 డిసెంబర్ 4న 13 మంది పౌరుల మృతికి కారణమైన 30 మంది ఆర్మీ అధికారులను ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్రం అనుమతి నిరాకరించడంతో నాగాలాండ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయమై నాలుగు వారాల్లో తమ అభిప్రాయాలు తెలపాలని కేంద్రానికి, రక్షణ మంత్రిత్వశాఖకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

అసలు వివాదం ఏంటి?

నాగాలాండ్ మోన్ జిల్లాలో ఓటింగ్, తిరు గ్రామాల మధ్య 2021లో జరిగిన కాల్పుల్లో 13 మంది మరణించారు. ఇందులో 13 మంది పౌరులు. ఒకరు ఆర్మీ జవాన్. ఓటింగ్ గ్రామానికి చెందిన దినసరి కూలీలు బొగ్గు గని నుంచి వ్యాన్‌లో ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. తిరుగుబాటుదారులుగా భావించి బొగ్గు గని కూలీలు ప్రయాణిస్తున్న వ్యాన్ పై సైనికులు కాల్పులు ప్రారంభించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. 13 మంది సాధారణ పౌరుల మృతికి కారణమైన జవాన్లపై రాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.


జవాన్లపై విచారణపై స్టే విధించిన సుప్రీంకోర్టు

నాగాలాండ్ లో 13 మంది సాధారణ పౌరుల మృతికి కారణమైన పారా స్పెషల్ ఫోర్సెస్‌కు చెందిన 21 మంది జవాన్లతో కూడిన అల్ఫా టీమ్‌ను ప్రాసిక్యూట్ చేయడంపై 2022 జూలై లో సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ సైనికుల భార్యలు రాష్ట్ర ప్రభుత్వం తమ భర్తలను కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే విచారిస్తోందని, ఆ ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ విచారణపై స్టే విధించింది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా నాగాలాండ్ పౌరుల మరణానికి కారణమైన ఆర్మీ జవాన్లను ప్రాసిక్యూట్ చేయడాన్ని నిరాకరిస్తున్నట్లు 2023 ఫిబ్రవరి 28న ప్రకటించింది.


 కీలక ఎవిడెన్స్ సేకరించిన సిట్

నాగాలాండ్ లో జరిగిన ఘటనకు సంబంధించిన కీలక సాక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సేకరించింది. ఈ సాక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వం 2022, మార్చి 24న కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు పంపింది. సామాన్యుల మరణానికి కారణమైన ఆర్మీ జవాన్లపై చర్యలు తీసుకోనేందుకు అనుమతివ్వాలని కోరింది. దీనికి సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించింది. కేసును విచారణకు స్వీకరించింది.

సుప్రీం కోర్టు తాజా నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం, రక్షణ శాఖలు స్పందించాల్సి ఉంది.

Tags:    

Similar News