హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతి వెనుక భారత్ వ్యూహమేంటి?

Update: 2020-04-09 10:16 GMT
Narendra Modi, Donald Trump (File Photo)

మనం ఈ రోజు మనం మాట్లాడుకుందాం ట్రంప్ నోటి దురుసుతనం గురించి. అదేమీ కొత్త విషయం కాదు. కాకపోతే తాజాగా ఆయన ఓ మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్ ప్రశ్నకు బదులిస్తూ భారత్ ను హెచ్చరించారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతి చేయకుంటే ప్రతీకారం తీర్చుకుంటామన్న రీతిలో సమాధానమిచ్చారు. నిజానికి ఆయన చేయాల్సింది స్నేహపూర్వక అభ్యర్థన. దాన్ని విస్మరించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం అడుక్కోవడంలోనూ దుందుడుకు వైఖరి ప్రదర్శించారు. దాని గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోటి దురుసుతనం ప్రపంచానికంతా తెలుసు. అంతే కాదు గంటల వ్యవధిలో మాట మార్చడం కూడా ఆయనకు కొత్తేమీ కాదు. తాజాగా భారత్ నుంచి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతి విషయంలోనూ అలానే జరిగింది. ఈ విషయంతో రెండు దేశాల ఆర్థిక, దౌత్య ప్రయోజనాలు ముడిపడి ఉండడంతో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.

కరోనా కట్టడికి ఏం చేయాలో అమెరికా అధ్యక్షుడికి అర్థం కావడం లేదు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో సంజీవని గా భావిస్తున్న హైడ్రాక్సీ హైడ్రాక్సీ క్లోరోక్విన్ కోసం ట్రంప్ పట్టుబడుతున్నారు. ఆ మందును ఎగుమతి చేయడం సాధ్యం కాదని భారత్ స్పష్టం చేయడంతో అడుక్కోవడానికి బదులుగా ప్రతీకార చర్యలు తీసుకుంటామనే ధోరణిలో బెదిరింపులకు దిగారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ ను హెచ్చరించే స్థాయికి ఎందుకు దిగజారిండో తెలుసుకోవాలంటే ఆ దేశానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ అవసరం ఏ స్థాయిలో ఉందో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు అందరి దృష్టి కూడా ఒకే అంశంపై ఉంది. నిజంగా అమెరికా హెచ్చరికలకు భారత్ తలొగ్గిందా అనే. మరి అందులో నిజం ఎంత ఉందో  చూద్దాం.

Full View



Tags:    

Similar News