Indian Railway: రైలు ప్రయాణంలో టికెట్ పోతే ఏం చేస్తారు..!
Indian Railway: రైలు ప్రయాణంలో టికెట్ పోతే ఏం చేస్తారు..!
Indian Railway: భారతీయ రైల్వే ద్వారా ప్రతిరోజు లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అయితే ఈ ప్రయాణంలో ఎప్పుడైనా టికెట్ పోగొట్టుకుంటే ఏం చేస్తారు.. ఆ పరిస్థితిలో టీటీ పట్టుకుంటే ఎలా ఉంటుంది..? ఆందోళన చెందకండి ఈ విషయం తెలుసుకుంటే సరిపోతుంది. ఇలాంటి సమయంలో రైల్వేశాఖ కొన్ని నిబంధనలను రూపొందించింది. రైలు టికెట్ లాస్ అయినప్పుడు మీరు తీసుకునే చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్త టిక్కెట్టు తీసుకోవచ్చు
ప్రయాణంలో టికెట్ పోయినట్లయితే మొబైల్ నుంచి టిక్కెట్‌ను చూపించే సౌకర్యం లేకుంటే అప్పుడు మీరు టీటీ నుంచి డూప్లికేట్ టిక్కెట్‌ను పొందవచ్చు. ఇందుకోసం రూ.50 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కానీ టికెట్ పోగొట్టుకుంటే వెంటనే టీటీని సంప్రదించాలి. మొత్తం విషయం తెలుసుకున్న తర్వాత టీటీ మీకు కొత్త టిక్కెట్‌ను జారీ చేయవచ్చు.
రైల్వే నిబంధనల ప్రకారం.. మీరు కౌంటర్‌లో టిక్కెట్‌ను బుక్ చేసుకొని ప్రయాణంలో టికెట్ పొగొట్టుకున్నట్లయితే స్లీపర్ క్లాస్‌కు రూ. 50, ఏసీ తరగతికి రూ. 100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా కారణం చేత మీరు మీ గమ్యస్థానాన్ని మించి ప్రయాణించవలసి వస్తే అప్పుడు కూడా మీరు టీటీ నుంచి టికెట్ పొందవచ్చు. కొన్ని నామమాత్రపు ఛార్జీలు చెల్లించి మీ ప్రయాణాన్ని పొడిగించుకోవచ్చు. దీని కోసం మీరు కొంత పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.