Manipur Protest: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస
Manipur Protest: కుకీ-మైతేయి వర్గాల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్
Manipur Protest: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో మళ్లీ హింస చెలరేగింది. కుకీ-మైతేయి వర్గాల మధ్య ఘర్షణలతో గతేడాది అట్టుడికిన ఈశాన్య రాష్ట్రంలో మళ్లీ అగ్గి రాజుకుంది. రాకెట్, డ్రోన్ బాంబు దాడులతో ఈసారి మరింత హైటెన్షన్ నెలకొంది. తాజా ఘర్షణల్లో సుమారు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్‌లో పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి.
ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. శాంతి భద్రతల దృష్ట్యా తూర్పు, పశ్చిమ ఇంఫాల్ జిల్లాల్లో ఉదయం 10 గంటల నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్లు జిల్లా యంత్రాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిషేధించింది. అయితే, కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలకు మినహాయింపులు ఇచ్చారు.