Vikas Dubey Encounter: దర్యాప్తుకు మరో కమిటీ

Vikas Dubey Encounter: కాన్పూర్‌లోని బికారు గ్రామంలో 8 మంది పోలీసులను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వికాస్ దుబే ఎన్‌కౌంటర్ కేసు సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది.

Update: 2020-07-20 13:27 GMT
Vikas Dubey Encounter

Vikas Dubey Encounter: కాన్పూర్‌లోని బికారు గ్రామంలో 8 మంది పోలీసులను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వికాస్ దుబే ఎన్‌కౌంటర్ కేసు సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఉత్తర ప్రదేశ్ డిజిపి తరఫున హరీష్ సాల్వే, రాష్ట్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన విజ్ఞప్తులను విచారించిన సుప్రీంకోర్టు, వికాస్ దుబే ఎన్‌కౌంటర్ కు కారణాలను తెలుసుకుంది.

ఈ సందర్బంగా హైదరాబాద్ లో జరిగిన (దిశ నిందితుల) ఎన్‌కౌంటర్ కేసుకు, వికాస్ దుబేకి పెద్ద తేడా ఉందని చీఫ్ జస్టిస్ ఎస్‌ఐ బొబ్డే అన్నారు. హైదరాబాద్ కేసులో నిందితుల మీద మహిళపై అత్యాచారం మరియు హత్య ఆరోపణలు ఉన్నాయని అన్నారు. చట్ట నియమాలను సమర్థించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని సుప్రీంకోర్టు తెలిపింది. అరెస్ట్, విచారణ మరియు తరువాత కోర్టు శిక్ష అనేది న్యాయ ప్రక్రియ అని గుర్తుచేసింది.

ఈ కేసును దర్యాప్తు చేయడానికి రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, రిటైర్డ్ పోలీసు అధికారిని చేర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఎన్‌కౌంటర్ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన కమిటీని మళ్లీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్‌ను కోర్టుకు సమర్పించనుంది.

ఇదిలావుంటే వికాస్ దుబే ఎన్‌కౌంటర్ సరైనదని పేర్కొంటూ పోలీసులు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందులో వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌ను హైదరాబాద్‌లో అత్యాచారం నిందితుల ఎన్‌కౌంటర్‌తో పోల్చలేమని పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయలేదని, యుపి ప్రభుత్వం దర్యాప్తు కోసం జ్యుడిషియల్ కమిషన్‌ను రూపొందించిందని ప్రస్తావించారు. కాగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో అతను పట్టుబడగా.. పోలీసులు కాన్పూర్‌కు తీసుకెళ్తుండగా వారి వాహనం బోల్తా పడింది. ఇదే అదనుగా వికాస్‌ తప్పించుకునే యత్నం చేశాడు. పోలీసులపైకి కాల్పులు జరిపాడు. పోలీసుల ఎదురుకాల్పుల్లో బుల్లెట్‌ గాయాలతో దుబే మృత్యువాతపడ్డాడు.


Tags:    

Similar News