Vaishno Devi Temple Reopens : తెరుచుకున్న వైష్ణోదేవి ఆలయం

Vaishno Devi Temple Reopens : కరోనా కారణంగా ప్రముఖ ఆలయాలు కొన్ని మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అందులో భాగంగా జమ్మూ కశ్మీర్‌

Update: 2020-08-16 11:42 GMT
Vaishno Devi Temple (File Photo)

Vaishno Devi Temple Reopens : కరోనా కారణంగా ప్రముఖ ఆలయాలు కొన్ని మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అందులో భాగంగా జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయం దాదాపు ఐదు నెలల నుంచి మూసివేశారు. మార్చి 18న ఆలయాన్ని మూసివేయగా ఆదివారం నుంచి దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ రోజుకు కేవలం 2,000 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ఇందులో 1,900 మంది స్థానికులు కాగా, ఇతర ప్రాంతాలవారు 100 మందికి అనుమతి ఇవ్వనున్నారు..

దర్శనాల కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేసినట్టుగా ఆలయ కార్యనిర్వహణాధికారి రమేశ్ కుమార్ వెల్లడించారు. ఇక పరిస్థితి మెరుగుపడిన తరవాత భక్తుల సంఖ్యను పెంచుతామని వివరించారు. ఇక రెడ్‌ జోన్‌ నుంచి వచ్చే భక్తులు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించుకొని, నెగెటివ్‌ వచ్చినట్టుగా చూపించాలని స్పష్టం చేశారు. ఇక యాత్రికులకు మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని, ఆరోగ్య సేతు యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సిందిగా వెల్లడించారు.

జమ్మూ కశ్మీర్‌లో ఆధ్యాత్మిక, మతపరమైన ప్రదేశాలను తెరవడానికి అక్కడి ప్రభుత్వం మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది. ఇందులో వైష్ణోదేవి ఆలయంతో పాటుగా సహా ఛారర్ ఇ షరఫ్, హజరత్బల్, నాంగాలీ షాహీబ్, షాహదార్ షరీఫ్, శివ్ ఖోరీ తదితర ప్రార్ధనా మందిరాల సందర్శనకు అనుమతిని ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విడుదల చేసిన మార్గదర్శకాలలో 10ఏళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్లు దాటినవారు, గర్భిణీలను అనుమతించబోమని స్పష్టం చేసింది. 

Tags:    

Similar News