Vaccine Certificate: వాట్సాప్‌లో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్
Vaccine Certificate: క్షణాల్లో డౌన్ లోడ్ చేసుకునే సౌకర్యం * అందుబాటులోకి వాట్సాప్ నంబర్
Vaccine Certificate: వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కోసం టెన్షన్ పడుతున్నారా?ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారా? ఇక ఆ కష్టాలు అక్కర్లేదు..జస్ట్ ఒక నంబర్ టైప్ చేస్తే చాలు క్షణాల్లో సర్టిఫికెట్ డౌన్‌లోడ్ అవుతోంది.కరోనా టీకా తీసుకున్న వారు వాట్సాప్ నుంచి సర్టిఫికేట్ తీసుకునే సౌకర్యాన్ని కేంద్రం కల్పించింది.
ప్రస్తుతం వ్యాక్సిన్ సర్టిఫికెట్ కావాలంటే కొవిన్ యాప్‌లోకి వెళ్లాలి. నంబరు టైప్ చేసి, ఓటీపీ వచ్చిన తర్వాత దానిని ఎంటర్ చేస్తేనే సర్టిఫికెట్ డౌన్‌లోడ్ సాధ్యమయ్యేది. యాప్ సపోర్ట్ చేయకపోతే నిమిషాల కొద్ది సమయం పట్టేది. అన్ని సరిగ్గా చేసినా ఒక్కోసారి డౌన్ లోడింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.. ఇక కష్టాలకు కేంద్రం చెక్ పెట్టబోతోంది. వాట్సాప్ ద్వారా క్షణాల్లో సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం చేయాల్సిందల్లా 90131 51515 నంబరును ఫోన్‌లో సేవ్ చేసుకోవడమే. ఆ తర్వాత ఆ నంబరుకు 'కొవిడ్ సర్టిఫికెట్' అని ఇంగ్లీష్‌లో టైప్ చేసి పంపిస్తే చాలు. క్షణాల్లో వాట్సాప్‌కు వచ్చేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.