బైక్ కోసం ఓ ప్రబుద్ధుడు భార్యను అమ్మకానికి పెట్టాడు. ఈ దారుణ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెహ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తుథియా గ్రామానికి చెందిన పునీత్ అనే వ్యక్తి కొత్వాలీ పోలీస్ సర్కిల్ ప్రాంతానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. కొంతకాలం నుంచి తనకు ద్విచక్రవాహనం కావాలంటూ భార్యను వేధించడంతో పాటు ఆమెను కొట్టేవాడు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది.
భార్య వెళ్లిపోవడంతో మరింత ఆగ్రహానికి గురయ్యాడు పునీత్. ఆమె ఫొటోలు, ఫోన్ నెంబరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అమ్మకానికి పెట్టాడు. తనకు డబ్బులు చెల్లించి.. ఆమెతో గడవవచ్చంటూ ప్రచారం చేశాడు. ఆమె వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అపరిచత వ్యక్తుల నుంచి పెద్ద మొత్తంలో కాల్స్ వెళ్లాయి. నిత్యం కాల్స్ రావడంతో బాధితురాలు విసిగిపోయింది. దీంతో ఆ పని చేసింది తన భర్తేనని తెలుసుకున్న ఆమె సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనలో పునీత్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.