PM Modi: మోడీ అమెరికా టూర్.. అక్రమంగా తరలించిన 297 పురాతన వస్తువుల వెనక్కి

PM Modi: భారత్‌కు ప్రాచీన వస్తువులను తిరిగి ఇచ్చేందుకు సిద్ధమైంది అమెరికా. గతంలో భారత్ నుంచి అక్రమంగా తరలించిన, చోరీకి గురైన పురాతనమైన 297 వస్తువుల్ని పంపనుంది.

Update: 2024-09-23 05:26 GMT

PM Modi: మోడీ అమెరికా టూర్.. అక్రమంగా తరలించిన 297 పురాతన వస్తువుల వెనక్కి

PM Modi: భారత్‌కు ప్రాచీన వస్తువులను తిరిగి ఇచ్చేందుకు సిద్ధమైంది అమెరికా. గతంలో భారత్ నుంచి అక్రమంగా తరలించిన, చోరీకి గురైన పురాతనమైన 297 వస్తువుల్ని పంపనుంది. ఈ వస్తువులన్నీ 4వేల సంవత్సరాల క్రితానికి చెందినవిగా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇటీవలే భారత్- అమెరికా కల్చరల్‌ ప్రాపర్టీ ఒప్పందం చేసుకోగా.. ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా తిరిగి వస్తువులను తిరిగి పంపుతున్నట్టు అమెరికా ప్రకటించింది. మోడీ, బైడెన్‌ భేటీ సందర్భంగా అందులోని కొన్ని వస్తువులను ప్రదర్శించింది.

కాగా మూడు రోజుల అమెరిక పర్యటనలో ప్రధాని మోడీ బిజీ బిజీగా గడుపుతున్నారు. న్యూయార్క్ లో మోడీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ ఈవెంట్ లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ప్రవాసీ భారతీయులతో ప్రధాని సమావేశమయ్యారు. మీ వల్లే ఇంతటి గౌరవం వచ్చింది.. ఇక్కడికి మీరు సుదూర ప్రాంతాల నుంచి వచ్చారని.. మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యావాదలు తెలియచేస్తున్నానన్నారు. భారత్ మాతాకి జై అంటూ ప్రసంగం మొదలు పెట్టిన ప్రధాని నమస్తే యూఎస్ అంటూ విష్ చేశారు.

గతంలో ఒక పార్టీ కార్యకర్తగా ఇక్కడికి వచ్చానని. ఏ పదవిలో లేనప్పుడు అమెరికాలో 29 రాష్ట్రాలు తిరిగానన్నారు. భారత్-అమెరికా అతిపెద్ద ప్రజా స్వామ్య దేశాలు.. నేను అమెరికా వచ్చిన ప్రతి సారి రికార్డు తిరగ రాశారన్నారు. వైవిధ్యంలో భిన్నత్వాన్ని అర్దం చేసుకుని జీవించడం మన మూలాల్లోనే ఉందన్నారు. విలువలే మన బలం.. భాషలు అనేకం.. భావం ఒక్కటే మీరు అమెరికా-భారత్ అనుసందాన కర్తలుగా ఉన్నారన్నారు. ఆ తర్వాత క్వాడ్ లీడర్స్ సమ్మిట్ లో పాల్గొన్నారు ప్రదాని మోడీ. ఐక్యరాజ్యసమితిలో చర్చల్లో పాల్గొన్నారు. పలు ఉన్నత స్థాయి సమావేశాల్లో ప్రదాని మోడీ పాల్గొన్నారు.


Tags:    

Similar News